Robot Suicide : పని ఒత్తిడి, మానసికంగా, శారీరకంగా తీవ్రమైన స్ట్రెస్, అలసట.. ఇలా వాటి నుంచి మనిషి బయటపడేందుకే రోబోలను తయారుచేశారు. మనిషికి విశ్రాంతి కావాలి, కానీ యంత్రాలకు ఎందుకు? మున్ముందు రోజుల్లో టెక్నాలజీ కారణంగా అంతా రొబోటిక్ అయిపోతుందని, పరిశ్రమల్లో మనుషుల అవసరమై తగ్గిపోతుందని బడాయిలు పోయారు శాస్త్రవేత్తలు. టెక్నాలజీ కారణంగా మున్ముందు రోబోల యుగం రానుందని తేల్చారు..
అయితే శాస్త్రవేత్తలకు సవాలు విసురుతూ ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. సౌత్ కొరియాలో గుమీ సిటి కౌన్సిల్‌లో సివిల్ సర్వెంట్‌గా ఉన్న ఓ రోబో సూసైడ్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒకే చోట చాలాసేపు తిరుగుతూ ఉన్న రొబో, ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. దాని కోసం గాలించగా మెట్ల కింద ఓ కుప్పలా కనిపించింది. సీసీటీవీ కెమెరాలను గమనించిన సిబ్బంది, రోబో తనంతట తాను డిస్మంటల్ బటన్ ప్రెస్ చేసుకుని, ఇలా కుప్పకూలినట్టుగా గుర్తించారు..
Silk Smitha : సిల్క్ స్మిత ఆత్మహత్యకు కారణమేంటి.. సూసైడ్ లెటర్ ఎందుకు బయటికి రాలేదు..!?
కొన్ని ఏళ్లుగా ఒకే పనిచేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోను కావడం వల్లే రోబో ఇలా చేసిందని సాంకేతిక నిపుణులు గుర్తించారు. పని ఎక్కువైతే మనుషులు మాత్రమే కాదు, రోబోలు కూడా తట్టుకోలేవని ఈ సంఘటనతో తేలిపోయింది. అయితే స్ట్రెస్‌తో మనుషుల మీద తిరగబడకుండా ఇలా ఆత్మహత్యకి పాల్పడడం ఒకందుకు మంచిదే అంటున్నారు. రోబోలు తిరగబడి ఉంటే ఇంకా ఎన్ని అనర్థాలు, దారుణాలు చూడాల్సి వచ్చేదోనని అంటున్నారు సైంటిస్టులు..