RGV Vyooham Review : ఓ స్టేజ్ దాటిన తర్వాత సమాజం అంటే గౌరవం, మనుషులను లెక్కచేయకపోవడం కామన్. ఆర్జీవీ ఈ స్టేజీ ఎప్పుడో దాటిపోయాడు… టాలీవుడ్ గతిని మార్చిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు వెటకారం కోసమే సినిమాలు చేసే పరిస్థితికి చేరుకున్నాడు. ఆ పైత్యంలో నుంచి పుట్టిన మరో సినిమాయే ‘వ్యూహం’..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం కాకుండా చేసేందుకు ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు చేసిన వ్యూహాలే ‘వ్యూహం’ మూవీ కథ. పేర్లు మార్చినా ప్రతీ పాత్ర రూపం చూస్తే, ఎవరు ఏ క్యారెక్టరో క్లియర్‌గా అర్థమయ్యేలా చిత్రీకరించడం వర్మ స్పెషాలిటీ…
నేను, మీ ఇద్దరి కాళ్లు నాకుతాను!.. ఆర్జీవీ, ‘యానిమల్’ రివ్యూ చదవితే..
ప్రజలు ఏం తీసినా చూస్తారనే స్టేజీకి చేరితే ‘అజ్ఞాతవాసి’, ‘స్కంధ’, ‘గుంటూర్ కారం’ వంటి సినిమాలు వస్తాయి. నేను ఏం తీసినా, ప్రజలు చూడాల్సిందే అనే రేంజ్‌కి పైత్యం చేరితే ‘వ్యూహం’ లాంటి సినిమాలు వస్తాయి. ఈ మూవీలో వెటకారంతో ఊహలతో అల్లేసుకున్న కథ, కథనాలు తప్ప ఏమీ ఉండవు. కనీసం వైఎస్ జగన్, వైసీపీ కార్యకర్తలు కూడా దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారంటే ఆర్జీవీ ఎలా తీశారో అర్థం చేసుకోవచ్చు..
వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ చక్కగా నటించాడు. అతనికి ఇలాంటి పాత్రలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు కూడా. మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు. అయితే కథ, కథనం అంతా ఓ రాజకీయ ఎజెండా ప్రకారమే నడుస్తుంది.
Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!
ప్రారంభంలో కొందరు ఎంజాయ్ చేసినా, కథ సన్నివేశాలన్నీ ఊహాల్లో నుంచి నడుస్తున్నట్టు ప్రేక్షకుడికి అర్థం కావడంతో ఎంజాయ్ చేయడం మానేసి, విసుగు చెందుతారు.. జగన్‌ని క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా చూపించేందుకు వచ్చిన ‘యాత్ర 2’ డిజాస్టర్‌గా మిగిలినా కల్ట్ జగన్ ఫ్యాన్స్‌ని మెప్పించింది. అయితే ఈ ‘వ్యూహం’ ఎవ్వరికీ నచ్చక, మరోసారి ఆర్జీవీ తన పైత్యంతో ప్రేక్షకులను ఫూల్ చేశాడనే భావన కలిగిస్తుంది.