RGV – Mani Ratnam : సౌత్ నుంచి వెళ్లి, బాలీవుడ్‌ని ఏలాడు రామ్ గోపాల్ వర్మ. తమిళ దర్శకుడు మణిరత్నం తీసే సినిమాలకు తెలుగు, హిందీల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లు రెండు సినిమాల కోసం కలిసి పనిచేశారనే విషయం చాలా మందికి తెలీదు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ సినిమాకి పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందించారు. ఈ సినిమా కథను రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం కలిసి రాశారు.. జగపతి బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడింది..
Mani Ratnam Thug Life : మణిరత్నం ‘థగ్ లైఫ్’లో ఏముంది..!?
అలాగే మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దిల్ సే’ మూవీకి రామ్ గోపాల్ వర్మ కూడా ఓ నిర్మాతగా ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ కూడా మణిరత్నం కూడా ఏ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడం కానీ, ట్రైయినింగ్ తీసుకోవడం కానీ చేయకుండానే సినిమాని డైరెక్ట్ చేశాడు. ‘పల్లవి అనుపల్లవి’ అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా మారిన మణిరత్నం, ఆ తర్వాత ‘ఉన్నారో’ అనే మలయాళ సినిమా తీశాడు. ఆ తర్వాత వరుసగా తమిళ్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా మారాడు..
మణిరత్నం తీసిన ఒకే ఒక్క తెలుగు సినిమా నాగార్జున ‘గీతాంజలి’. క్లాస్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’, మాస్ కమర్షియల్ ‘శివ’ ఒకే ఏడాది రిలీజ్ చేసిన హిట్స్ కొట్టిన క్రెడిట్ మాత్రం నాగార్జునకే దక్కుతుంది.. మణిరత్నం, ఆర్జీవీ స్నేహం విడిపోవడానికి వారి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణం.