Revanth Reddy : జైలుకి వెళ్లి వచ్చిన మనిషి అంటే సభ్యసమాజం ఓ చీడ పురుగులా చూస్తుంది. తప్పు చేసినా, చేయకపోయినా జైలుకి వెళ్లి వచ్చాడంటే చాలు.. పెద్ద దోషిగానే చూస్తారు. అయితే ఇవన్నీ సామాన్య ప్రజల వరకే. రాజకీయాల్లో జైలుకి వెళ్లి వచ్చిన వాళ్లకు స్పెషల్ మర్యాదలు ఉంటాయి. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే, అంత మంచి పదవులు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.
ఎట్లుండే తెలంగాణ అంటూ చేసిన ప్రచారమే బీఆర్‌ఎస్‌ని ముంచిందా..!?
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్నాడు. 10 ఏళ్ల కిందట ‘ఓటుకి నోటు’ కేసులో కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి, జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.
అలాగే అక్రమ ఆస్తుల కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. ఈ కేసుల్లో కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికీ సీబీఐ విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు. జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు.
ఆడు మగాడ్రా బుజ్జి! సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిపై గెలిచిన వెంకటరమణా రెడ్డి..
అంతకుముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్టైన కేసీఆర్ కూడా జైలులో ఉన్నారు. దీంతో జైలుకి వెళ్లి వచ్చిన వాళ్లంతా ముఖ్యమంత్రులు అవుతున్నారనే కొత్త సెంటిమెంట్, తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ లెక్కన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలు శిక్ష అనుభవించిన చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అనే ఆసక్తి కూడా నెలకొంది.
జనసేన వ్యూహాత్మిక తప్పిదం.. 10 రోజుల ముందు పోటీ చేసి, పరువు పోగొట్టుకుని..