Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు, ఈ ట్రోలింగ్‌ని చూసి, చూడనట్టుగా వదిలేస్తారు. కానీ రేణు దేశాయ్ మాత్రం అలా వదిలేయదు. కొన్నిరోజులుగా రేణు దేశాయ్, ఇలా సోషల్ మీడియాలో ఎగతాళిగా ట్రోల్స్, మీమ్స్ చేసేవారితో మినీ యుద్ధమే చేస్తోంది. పవన్ కళ్యాణ్ వారసులు అకీరా నందన్, ఆద్య గురించి ఏ ఒక్క ఫోటో లేదా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, కొంతమంది అతి చేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రోల్స్‌పై రేణుదేశాయ్, ప్రతిసారి రియాక్ట్ అవుతూనే ఉంది..
తన పిల్లల విషయంలో రేణుదేశాయ్ ఎప్పుడు పోరాడుతూనే ఉంది. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎప్పటికప్పుడు గట్టిగా బదిలిస్తూనే ఉంది. తాజాగా ‘ఈ తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది’ అంటూ రేణు దేశాయి భావోద్వేగంతో తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరిగి మంగళగిరికి వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల రోడ్డు పక్కన కారు ఆపి రిలాక్స్ అయ్యారు. ఈ టైమ్‌లో పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆనాలతో కలిసి అకిరా నందన్, ఆద్య కొణిదల ఫోటో దిగారు. ఈ ఫ్యామిలీ ఫోటోని జనసేన పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోని చాలామంది అభిమానులు సంతోషంతో షేర్ చేసుకున్నారు.
అయితే కొంతమంది ఆ ఫోటోని కొన్ని పేజీల్లో దారుణంగా ట్రోల్ చేశారు.. ‘ఏవేవో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం వల్ల వాటిని చూసిన ఆద్య కొణిదల రోజంతా ఏడుస్తూనే ఉంది, ఒక తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది‘ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత వెంటనే డిలీట్ చేశారు.
Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..
‘నేను ఈ ఫోటోని ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తాను..’ అంటూ నాపై జోక్స్ వేస్తూ, మీమ్స్ తయారుచేసి ఆనందం పొందే మీకు ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోండి. నా కూతురు (ఆద్య) ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక మీమ్ పేజీలో తన తల్లిని ఎగతాళి చేస్తూ మాట్లాడడం చూసి చాలా ఏడ్చింది. సెలబ్రిటీలు , రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతారి చేసేవాళ్లంతా ఒక్కసారి మీ ఇళ్లల్లో తల్లులు, అక్కాచెల్లెలు ఉన్నారని గుర్తుంచుకోండి.
మాపై అభ్యంతకరమైన జోక్స్ వేస్తున్నవారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించిన బాధ కార్చిన కన్నీరుకు మీరు కచ్చితంగా సమాధానం చెప్పాలి.. గుర్తుంచుకోండి! అన్నా లేసినోవా పిల్లలు కూడా ఈ మీమెస్, కఠినమైన కామెంట్స్ వల్ల బాధపడుతున్నారు.. అతి భయంకరమైన మనుషుల్లా తయారవుతున్న కొన్ని మీమ్స్ పేజీ అడ్మిన్స్ అందరికీ ఈ శాపం కచ్చితంగా తగులుతుంది. నేను ఈ పోస్ట్ పెట్టేముందు ఒకటికి 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే డిలీట్ చేశారు రేణు దేశాయ్..