Salaar Movie Promotions : డిసెంబర్ 22న ‘సలార్’ రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతోందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. కారణం ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ ఇప్పటిదాకా ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు ‘సలార్’ టీమ్. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ప్రకటన చేయలేదు. అంటే దాదాపు ‘సలార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే.
రికార్డులు దున్నేందుకు ‘సలార్’ మాస్టర్ ప్లాన్.. ఒక్క కర్ణాటకలోనూ వెయ్యికి పైగా థియేటర్లు..
అలాగే ప్రస్తుతం ‘కల్కీ 2898AD’ షూటింగ్‌కి షిఫ్ట్ అయిన ప్రభాస్, ‘సలార్’ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా సినిమా స్టోరీ గురించి అప్పుడప్పుడూ ఒకటి రెండు డైలాగ్స్ చెప్పడం తప్ప, ప్రమోషన్స్ చేయడం లేదు. ఇదే ప్రొడక్షన్ హౌస్ హంబల్ ఫిల్మ్స్ ‘కేజీఎఫ్’ సినిమాని వీర లెవెల్లో ప్రమోట్ చేసింది.
పాన్ ఇండియా లెవెల్లో ‘సలార్’ రిలీజ్ అవుతున్నా, ఆ హడావుడి, సందడి కనిపించడం లేదు. తెలుగులో ప్రభాస్ కటౌట్‌కి కలెక్షన్లు వస్తాయి. అయితే హిందీలో మాత్రం ప్రమోషన్స్ చాలా అవసరం. షారుక్, సల్మాన్, ఆమీర్ వంటి హీరోలే తమ సినిమాల కోసం విపరీతమైన ప్రమోషన్స్ చేస్తారు. మరి ప్రభాస్, ప్రశాంత్ నమ్మకం ఏంటి?
సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?
‘సాహో’, ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’ మూవీస్‌ని విపరీతంగా ప్రమోట్ చేశాడు ప్రభాస్. ఈ మూవీస్ డిజాస్టర్ కావడంతో ఏ మొహం పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ‘సలార్’ ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నాడట. రిలీజ్ తర్వాత ‘సలార్’ని విపరీతంగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడని టాక్..