Reasons behind Celebraties ads : ఒక బిజినెస్ చేయడానికి డబ్బులు అవసరం, పని చేసేవాళ్లు మాత్రమే అవసరం అనుకుంటున్నారు ఇప్పటికి కూడా..! అయితే ఏదైనా బిజినెస్ చెయ్యాలి అంటే.. ముందు ప్రజల్లోకి ఆ ప్రొడక్ట్ ని తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే.. డిజిటల్ మార్కెటింగ్ అవసరం. అవే.. మనం చూసే రోజు వారి యాడ్స్.
అయితే ఒకప్పుడు మనకి తెలియని వారి ముఖాలతో యాడ్స్ చేసేవారు. అయితే ఇంకొంచెం ముందుకు వచ్చి తెలిసిన మొఖాలతో అంటే.. టీవీ సినిమా ఇతరాత్ర యాక్టర్స్ తో చేసి జనాలలోకి తీసుకుని వస్తున్నారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.
దర్శకధీరుడు జక్కన్న తను తీసే సినిమాకి ఎంత శ్రద్ద తీసుకుంటాడో, అంతకుమించి ఆ సినిమా ప్రమోషన్ చేస్తాడని మనకు తెలిసిందే. ఎందుకంటే.. సినిమా బాగుంటే కాదు, సినిమా జనాల్లోకి వెళ్తేనే ఆ సినిమాకి హైప్ వచ్చేది. ఉదాహరణకు బాహుబలి2 సినిమాకి ఇచ్చినంత ఎలివేషన్ ఇవ్వాలి అది తన ప్రొడక్ట్, తనకు నచ్చిన ధర అన్నట్టూ ఆ సినిమాలకి రాజమౌళి టికెట్ రేట్ నిర్ణయిస్తాడు.
అయితే ఇక్కడ భారీగా బాలీవుడ్ రీతిలో తయారు చేసిన యాడ్ స్క్రిప్ట్ తో అంతకుమించి మించి రేమునేషన్ తీసుకొని యాడ్స్ చేస్తున్నారు మన అచ్చుమెచ్చు స్టార్ట్స్. సినిమా, సీరియల్, స్పోర్ట్స్ స్టార్స్ ఎవరైనా మొదట జనాలలో గుర్తింపు తెప్పించుకోవడమే తరువాయి యాడ్స్ కోసం పాకులాడతారు. కారణం తాము తీసుకున్న రెమ్యూనషన్స్ కి మించి యాడ్స్ కి దొరకడం.
SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..
ఇది అన్నివేళలా అందరికీ మంచేనా అంటే.. ప్రొడక్ట్ కి అమ్మకాలు పెరుగుతాయి, పెరిగితే ఆ యాక్టర్ కోసం మరి కొన్ని యాడ్ ఏజెన్సీలు క్యూ కడతారు. ఆ సెలబ్రిటీ కి బోలెడన్ని డబ్బులు కూడా వస్తాయి.
మరి గ్రాహకుడికి?
ఏమో ఎవరికీ తెలుసు..
సదరు కూల్ డ్రింక్స్,
కార్స్,
పాల్లో కలుపుకుని తాగే పొడులు,
వక్క పొడులు,
వెంచర్స్, Constructions
అసలు మట్టి వాసనే మర్చిపోయిన కొంతమంది సెలబ్రిటీలు పొలాలకు విత్తనాలు, పురుగుల మందులు గురించి చెప్పడం అయితే.. నాభూతో నాభవిష్యత్..
పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు..
ఆరోగ్యం పాడైపోయిన, జేబులకు చిల్లులు పడినా వారికి అవసరం లేదు. వాళ్ళ జేబులు నిండటమే కావాలి వాళ్ళకి.. అలాంటి సెలబ్రిటీస్ కోసం మనం పాకులాడటం మా వాళ్ళు గొప్ప అంటే మీ వాళ్ళు దిబ్బ అనడం.
బాగుందయ్యా “గ్రాహక ” . .