RCB Womens : ఈసాలా కప్ నమ్ దే.. అంటూ 16 సీజన్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్. సీజన్ల కొద్దీ సీజన్లు మారుతున్నా, టైటిల్ మాత్రం రాలేదు. మగాళ్లు 16 సీజన్లుగా చేయలేని పనిని, అమ్మాయిలు రెండో సీజన్‌లోనే చేసి చూపించారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్‌కి ఆర్‌సీబీ మహిళల జట్టు కైవసం చేసుకుంది.
Poonam Kaur : ఇండస్ట్రీలో గురుజీ అంటే ఆయనకొక్కడే! స్క్రిప్ట్‌లు హైజాక్ చేసేవాడు గురూజీ కాదు..
ఢిల్లీలో ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆర్‌సీబీ. ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒకే సీజన్‌లో పర్పుల్ క్యాప్ (శ్రేయాంక పాటిల్), ఆరెంజ్ క్యాప్ (ఎల్లీస్ పెర్రి), టైటిల్ మూడు గెలిచిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది ఆర్‌సీబీ..
ఆర్‌సీబీ అంటేనే బ్యాడ్‌లక్‌కి కేరాఫ్ అడ్రెస్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే అది నిజం కాదని అమ్మాయిలు నిరూపించేశారు. కేవలం మగాళ్ల టీమ్ చేతకాని తనం వల్లే ఇన్నాళ్లుగా టైటిల్ రాలేదని ఖరారైపోయింది. మహిళల టీమ్‌కి కంగ్రాట్స్ తెలిపిన ఆర్‌సీబీ ఓనర్ విజయ్ మాల్యా, పురుషుల టీమ్ నుంచి టైటిల్ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందంటూ ట్వీట్ చేశాడు.అయితే ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ విషయం తర్వాత ముందు నువ్వు బ్యాంకులకు కట్టాల్సిన పెండింగ్ బాకీల సంగతి ఏంటి? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు..
Devara Update : మళ్లీ సాగరానికి దేవర..