Ravi Teja – Sreeleela : ‘ధమకా’ జోడీ రిపీట్..

Ravi Teja - Sreeleela
Ravi Teja - Sreeleela

Ravi Teja – Sreeleela : అతి తక్కువ సమయంలో తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. 2023 సెప్టెంబర్ నుంచి 2024 జనవరి వరకూ ప్రతీ నెలా ఓ సినిమా రిలీజ్ చేసిన శ్రీలీల, కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు మరో సినిమాని పట్టాలెక్కించింది శ్రీలీల. ‘ధమాకా’ సినిమాలో కలిసి నటించిన రవితేజతో మరోసారి ఆడి పాడనుంది శ్రీలీల. ఆ సినిమా తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ ఇలా వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఇది 75వ సినిమా కూడా..

భాను భోగవరపు అనే కొత్త దర్శకుడికి, తన 75వ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ‘ఈగల్’ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుననారు. ‘రవన్న దావత్ ఇస్తుడు.. రెడీ అయిపోండ్రి’ అంటూ కాప్షన్ జోడించిన ఈ సినిమాలో రవితేజ ఫుల్లు ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడట.

Ranbir Kapoor : శ్రీరాముడి పాత్రలో నటిస్తూ, మందు కొడుతూ దొరికిపోయిన రణ్‌బీర్..

కొన్నాళ్లకు సీరియస్ పాత్రలు చేస్తూ, తన మార్కు కామెడీ టచ్‌ని మిస్ చేసుకున్నాడు రవితేజ. ఈ కారణంగానే ఆయన సినిమాలు ఫ్యాన్స్‌ని కూడా మెప్పించలేకపోయాయి. అందుకే ఈసారి ప్రయోగాలను పక్కనబెట్టి, మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్‌ని పూర్తిగా ఖుష్ చేస్తుందని అంటున్నాడు మాస్ రాజా. కొంత బ్రేక్ తర్వాత వస్తున్న శ్రీలీలకి కూడా ఈ సినిమా చాలా మెయినూ..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post