Ranbir Kapoor : శ్రీరాముడి పాత్రలో నటిస్తూ, మందు కొడుతూ దొరికిపోయిన రణ్‌బీర్..

Ranbir Kapoor : ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడిగా నటించిన ప్రభాస్, ఆ సమయంలో మాంసాహారం తిన్నాడని ఓ బాలీవుడ్ క్రిటిక్.. అప్పట్లో తీవ్రమైన ప్రచారం చేశాడు. ఇప్పుడు అదే దేవుడి పాత్రలో నటిస్తున్న సో కాల్డ్ బాలీవుడ్ స్టార్ హీరో ఏకంగా మందు తాగుతూ దొరికిపోయాడు. ‘యానిమల్’ మూవీలో అల్ఫా మేల్ క్యారెక్టర్‌లో జీవించేసిన రణ్‌బీర్ కపూర్, ప్రస్తుతం ‘రామాయణ్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైపోయింది కూడా..

Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

శ్రీరాముడి పాత్రలో నటిస్తుండడంతో రణ్‌బీర్ కపూర్, ఈ సినిమా పూర్తి అయ్యే వరకూ మందు, సిగరెట్, మాంసాహారం అన్నీ మానేశాడని.. పూర్తి వెజిటేరియన్ అయిపోయాడని కొన్ని బాలీవుడ్ వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. అయితే రణ్‌బీర్ కపూర్, ఆకాశ్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో డ్రింక్ చేస్తూ కనిపించాడు. దేవుడి పాత్రలో నటిస్తున్నందుకు మందు మానేశాడనేది కేవలం రూమర్ మాత్రమేనని తేలిపోయింది. ప్రభాస్, శ్రీరాముడిగా నటిస్తూ మటన్ తిన్నాడని చెప్పిన ఆ సదరు బాలీవుడ్ క్రిటిక్, రణ్‌బీర్ కపూర్‌ చేసిన దానిపై స్పందించలేదు..

నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రామాయణ్‌ మూవీలో సన్నీ లియోనీ శూర్ఫణక పాత్రలో కనిపిస్తుందని, రావణాసురుడిగా ‘కేజీఎఫ్’‘కేజీఎఫ్’ యష్ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post