‘యానిమల్’ కోసం 500 కేజీల మిషన్ గన్.. ఈ సెంటిమెంట్ తేడా కొట్టిందో..

Ranbir Kapoor Animal : రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీ, డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డి తీసిన మూవీ కావడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత పెంచేశాడు సందీప్. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.. ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ ఓ ఫైట్‌ సీన్‌లో ఓ పెద్ద మెషిన్ గన్‌తో కనిపించాడు.

మహేష్ ‘యానిమల్’ కాదు, ఆయనకి చెప్పింది ‘డెవిల్’ : సందీప్ రెడ్డి వంగా

ఈ గన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్. ‘ట్రైలర్‌లో చూసిన మెషిన్ గన్ వీఎఫ్‌ఎక్స్ కాదు. ట్రైలర్ చూసిన చాలామంది అది గ్రాఫిక్స్‌లో చేసి ఉంటారని అనుకుంటున్నారు. అయితే దాన్ని మూడు నెలల పాటు కష్టపడి తయారుచేయించాం. దీని కోసం పూర్తిగా మెటల్ వాడాం. దాదాపు 500 కేజీల బరువు ఉండే ఈ మెషిన్ గన్ సీన్ చాలా బాగా వచ్చింది. ఓ మూవీ కోసం ఇలాంటి గన్ చేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారి’.. అంటూ చెప్పుకొచ్చాడు ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్..

రేంజ్ పెంచేస్తున్న అల్లు అర్జున్… ‘పుష్ప’ తర్వాత తగ్గేదే లే! త్రివిక్రమ్‌తో సినిమాకి..

కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ నుంచే ఈ భారీ మెషిన్ గన్ సీన్స్‌ బాగా పెరిగాయి. ‘కేజీఎఫ్ 2’లో ఇలాంటి గన్ సీన్ హైలైట్‌గా నిలిచింది. కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లోనూ ఇలాంటి భారీ గన్ సీన్ ఉంటుంది. అయితే అఖిల్ ‘ఏజెంట్’ విషయంలో ఈ భారీ గన్ సెంటిమెంట్ తేడా కొట్టేసింది. అందుకే ఒకటి రెండు సినిమాల్లో వర్కవుట్ అయ్యింది కదా అని, ప్రతీ మూవీలోనూ భారీ గన్ పెడితే ప్రేక్షకులకు బోర్ కొట్టేయడం ఖాయం. మరి ‘యానిమల్’ విషయంలో ఈ భారీ గన్ సెంటిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post