Ram Pothineni : చైతూని ఫాలో అవుతున్న Rapo..

Ram Pothineni : సాయిపల్లవితో చేసిన ‘లవ్ స్టోరీ’, తండ్రి నాగార్జునతో చేసిన ‘బంగార్రాజు’ సినిమాల తర్వాత ‘థ్యాంక్యూ’, ‘కస్టడీ’ సినిమాలు చేసి వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేశాడు నాగచైతన్య.. ‘థ్యాంక్యూ’కి నెగిటివ్ టాక్ వచ్చినా, ‘కస్టడీ’ మూవీకి మొదటి రోజు పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అయితే థియేటర్ల దగ్గర ఈ సినిమా 30 శాతం కూడా వెనక్కి రాబట్టలేక ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న చైతూకి సక్సెస్ ఇచ్చింది ‘దూత’ వెబ్ సిరీస్…

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్, తెలుగులో కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా నాగచైతన్యను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు రామ్ పోతినేని. జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది..

Mega Family Rare Pic : పవన్ కళ్యాణ్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా..!?

అయితే అనివార్య కారణాలతో చాలా రోజుల పాటు షూటింగ్ ఆగిపోయింది. వారం కిందటే తిరిగి షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ లెక్కన అనుకున్న సమయానికి ‘డబుల్ ఇస్మార్ట్’ రావడం కష్టమే. ఇదిలా ఉంటే ‘డబుల్ స్మార్ట్’ తర్వాత ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు రామ్ పోతినేని. ఈ వెబ్ సిరీస్‌కి లవ్ స్టోరీ చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం చేస్తాడట. మే 15న రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన వివరాలను రివీల్ చేయబోతున్నారు.. షాహీద్ కపూర్ చేసిన ‘ఫర్జీ’ తరహాలో రామ్ పోతినేని చేయబోయే వెబ్ సిరీస్ ఉంటుందంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post