Ram Charan wild cutout : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా అభిమానులు విజయవాడలో వంద అడుగుల భారీ కట్ అవుట్ ఏర్పాటు చేశారు. ఈ కట్ అవుట్ స్థానిక ప్రజల్లో మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ట్ గురించి చేసిన పని గ్లోబల్లీ ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, విమర్శలు కూడా ఎదుర్కొంటోంది, ఎదురుకోవడమే కాదూ సినీ మనుషుల మీద ప్రేమ వాస్తవిక పరిస్థితులకు దూరంగా వుంటుంది.
అవసరం లేని ఖర్చు, పర్యావరణానికి జరిగే ముప్పు, ఫ్యాన్ మేనియా అనూహ్య సంఘటనలు జరుగుతున్న.. అవాస్తవికతలో యువత బతుకుతుంది అనిపించే విధంగా ఉన్నాయి. కొందరు హీరోలు బాధ్యతగా కొవిడ్ టైంలో పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఆ డబ్బుతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వండి అని పిలుపునిచ్చారు.
మరిప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో తమ హీరో సినిమా కోసం చేస్తున్న హంగామాతో అభిమానులు హీరోలపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం సహజమే. కానీ, ఈ ప్రేమ సమాజానికి ఉపయోగకరమైన మార్గాల్లో ఉంటే ప్రేమకి అసలైన అర్థం ఉంటుంది. కట్ అవుట్‌లు, ఫ్లెక్సీలకు వెచ్చించే డబ్బు ప్రాణాలను రక్షించే సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించడానికి హీరోలు పిలుపునివ్వాలి.
ఇకనైనా అలా చేయగలిగితేనే ప్రేమ అవుతుంది లేదంటే ఉన్మాదంగా తయారవుతుంది. ఇదే అభిమానం మొన్నటికి మొన్న నిండు ప్రాణం బలిగొంది. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అవన్నీ ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్న అభిమానులది తప్పా లేక అన్నీ చూస్తూ ఫ్రీగా వస్తున్న పబ్లిసిటీనీ చూస్తు కూర్చున్న హీరోలది తప్పా, ఎవరిది ఈ తప్పు..!!