Ram Charan : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్, ఆమీర్, సల్మాన్ కలిసి ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ముగ్గురు సూపర్ స్టార్లు కలిసి డ్యాన్స్ చేయించిన క్రెడిట్ అంబానీకే దక్కుతుంది. ఈ ముగ్గురూ తమ స్టైల్లో నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేసిన తర్వాత రామ్ చరణ్‌ని స్టేజ్‌పైకి పిలిచారు. ఈ సమయంలో షారుక్ వాడిన భాషపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది.
Mahesh Babu : ఇష్టమైన థియేటర్ని కొనేసిన మహేష్ బాబు..
‘ఇడ్లీ వడా సాంబార్ రామ్ చరణ్.. కహా హై తూ… వేర్ ఆర్ యూ రామ్ చరణ్’ అంటూ పిలిచాడు షారుక్ ఖాన్. ఈ విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసేదాకా ఎవ్వరూ గమనించలేకపోయారు. ‘షారుక్ ఇలా పిలవడంతో నేను షాక్ అయ్యా. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయా..’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేసింది ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ హాసన్.
తమిళనాడు వాళ్లను ఇడ్లీ, సాంబర్, వడ అని వెటకారంగా పిలవడం నార్త్ వాళ్లకు, అంతెందుకు తెలుగువాళ్లకు కూడా బాగా అలవాటే. సౌత్ వాడు కావడంతో రామ్ చరణ్‌ని కూడా అలా వెటకారంగా పిలిచాడని, గ్లోబల్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్‌ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇదే వీడియోలో స్టేజ్ పైకి వస్తున్న రామ్ చరణ్‌కి తలవంచి, షారుక్ సాదరంగా ఆహ్వానించడమూ ఉంది. దీన్ని షారుక్ ఫ్యాన్స్ గుర్తించి, చెర్రీ ఫ్యాన్స్ వాదన కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
Siddharth Roy Review : ట్రెండ్ పేరుతో విపరీతం.. అర్జున్ రెడ్డిని మించి..