Ram Charan Bollywood : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, హీరోగా ఎంట్రీ ఇచ్చి17 ఏళ్లు కావస్తోంది. టాలీవుడ్ టాప్ హీరో ప్లేస్ కోసం రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలతో పోటీపడుతూనే ఉన్నాడు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోగా అల్లు అర్జున్‌కి కూడా మలయాళంలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో టాప్ హీరో రేసులో ముందుకు వెళ్లడానికి బాలీవుడ్ ఒక్కటే మార్గమని త్వరగానే గ్రహించాడు రామ్ చరణ్..
రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!
కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్ సినిమా ‘జంజీర్’ తీసి చేతులు కాల్చుకున్న రామ్ చరణ్, బాలీవుడ్‌లో జెండా పాతాలనే కలను మాత్రం వదులుకోలేదు. అందుకే చరణ్, బాలీవుడ్ రీఎంట్రీ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్.. క్లాసిక్ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, చరణ్‌తో సినిమా తీయబోతున్నాడని టాక్ నడిచింది. నాలుగైదేళ్లకు ఓ సినిమా చేసే హిరాణీ దర్శకత్వంలో నటించేందుకు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్లే ఎదురుచూస్తూ ఉంటారు.
స్వయంగా రాజ్ కుమార్ హిరాణీయే రాం చరణ్‌తో సినిమా ప్రచారం కేవలం రూమర్ మాత్రమేనని తేల్చేశాడు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. 11వ శతాబ్దానికి చెందిన చక్రవర్తి సుహల్ దేవ్ బయోపిక్ ఆధారంగా ఓ యుద్ధ ప్రాధాన్య సినిమాని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఉందో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే..
నిత్యా మీనన్‌తో అలాంటి సీన్ చేయించాలనుకున్న చిత్ర యూనిట్.. హీరోయిన్ చేసిన పనికి..