Rajinikanth Lal Salaam : ‘శత్రువులు ఎక్కడో ఉండరుగా, కూతుళ్లు, పెళ్లాల రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు..’ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఈ డైలాగ్, సినిమా వాళ్లకి కూడా బాగా సెట్ అవుతుంది. ‘జైలర్’ మూవీతో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఆ వెంటనే ‘లాల్ సలాం’ మూవీతో అట్టర్ ఫ్లాప్ ఇచ్చింది ఆయన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్..
Balakrishna : బాలయ్య సినిమాలో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి..
ఇంతకుముందు బావ ధనుష్‌తో ‘3’ మూవీ చేసిన ఐశ్వర్య, ఈసారి తండ్రితో ‘లాల్ సలాం’ మూవీ చేసింది. అయితే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ మాత్రం మారలేదు. ‘3’ మూవీలో సూపర్ హిట్ సాంగ్స్ కారణంగా మంచి ఓపెనింగ్స్ అయినా దక్కాయి. ‘లాల్ సలాం’ అయితే మొత్తానికే చేతులు ఎత్తేసింది. తెలుగులో అయితే కనీసం రూ.2 కోట్ల షేర్ కూడా రాలేదు ఈ మూవీకి…
పరువు మొత్తం పోయాక ఈ సినిమాలో 20 నిమిషాల కీలకమైన సీన్స్ మిస్ అయ్యాయని అంటోంది ఐశ్వర్య. ‘20 నిమిషాల క్రికెట్ మ్యాచ్ షూట్ చేశాం. ఈ మ్యాచ్ కోసం 10 కెమెరాలు పెట్టి, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, మరో 1500 మంది టెక్నీషియన్లతో కలిసి 21 రోజులు షూట్ చేశాం.
Devara Update : మళ్లీ సాగరానికి దేవర..
అయితే ఆ పార్ట్ ఉన్న హార్డ్ డిస్క్ పోయింది. ఇది తెలిసాక రీషూట్ చేయాలని ప్రయత్నించాం కానీ బడ్జెట్ కారణాలతో చేయలేకపోయాం. అది ఉండి ఉంటే సినిమా చాలా బాగుండేది. నిజం చెప్పాలంటే ఈ పార్ట్ లేకుండా చాలా కాంప్రమైజ్ అయ్యాం. సినిమా మాక్కూడా నచ్చలేదు..’ అంటూ వ్యాఖ్యలు చేసింది దర్శకురాలు ఐశ్వర్యా రజినీకాంత్..