Rajadhani Files Review : ఏపీ రాజకీయాలపై వారానికో సినిమా విడుదల అవుతోంది. గత వారం జగన్ బయోపిక్‌గా ‘యాత్ర 2’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ వారం జగన్‌కి యాంటీగా తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్’ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ విడుదలను అడ్డుకుంటూ హైకోర్టులో స్టే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే తెలంగాణలో మాత్రం ‘రాజధాని ఫైల్స్’ థియేటర్లలో మార్నింగ్ షో ప్రదర్శితమైంది.
Ooru Peru Bhairavakona Premieres Review : గ్యాప్ వచ్చినా, గట్టిగా కొట్టేసిన సందీప్..
ట్రైలర్లో చూపించినట్టుగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి గత సర్కారు పనులు ప్రారంభించడం, కొత్త సర్కారు రాగానే దాన్ని రద్దు చేయడం నుంచే ‘రాజధాని ఫైల్స్’ మూవీ మొదలవుతుంది… పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఎవరు ఏ పాత్ర చేస్తున్నారో, ఏ పాత్రను తెర మీద చూపిస్తున్నారో స్పష్టంగా అర్థమయ్యేలా డైరెక్టర్ తెరకెక్కించాడు.
వైఎస్ వివేకా హత్య కేసును చూపించిన విధానం తీవ్ర వివాదాస్పదం అవుతుంది. అమరావతిని ఐరావతిగా చూపించినా, రైతుల ఆందోళనలను పక్కాగా తెరకెక్కించడంలో మాత్రం డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న వ్యక్తిని ఓ వీధి రౌడీలా చూపించడం పక్కనబెడితే, రైతుల ఆందోళన అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కించాలనుకోవడం మంచి కాన్సెప్ట్.
Yatra 2 Vs Rajadhani Files : ఏపీ పాలిటిక్స్ చుట్టూ మూడు సినిమాలు..
‘యాత్ర 2’లాగే ఇది కూడా పక్కా రాజకీయ ఏజెండాతో వచ్చిన సినిమా.. అయితే ఇది అధికార పక్షానికి వ్యతిరేకంగా తెరకెక్కిన సినిమా. కొత్త కథ, సరికొత్త కథనం.. ఇలా చెప్పుకోవడానికి ఇందులో గొప్పగా ఏమీ ఉండవు. కానీ పొలిటికల్ ఏజెండాగా ఇలా జరిగి ఉంటుందని ఊహించుకుని, అల్లేసిన సినిమా.. టీడీపీ ఫ్యాన్స్‌కి, వైసీపీ వ్యతిరేకులకు ఇది కచ్ఛితంగా నచ్చే సినిమానే… ‘యాత్ర 2’లో మూవీలో లాగ ఇందులో ఎలివేషన్స్, ఎమోషన్స్ ఏమీ లేకపోయినా రైతుల సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయ్యింది.