Raj Tarun and Lavanya : కెరీర్ మొదట్లో వరుస హిట్లు కొట్టిన రాజ్ తరుణ్, ఈ మధ్య ఫ్లాపుల మీద ఫ్లాపులు చూస్తున్నాడు. హీరో నుంచి సైడ్ క్యారెక్టర్‌కి పడిపోయి, ‘నా సామి రంగ’ సినిమాలో నాగ్‌తో కలిసి నటించాడు. దాదాపు ఇండస్ట్రీలో అందరూ రాజ్ తరుణ్‌ని మరిచిపోయిన సమయంలో ‘అతను నాతో 11 ఏళ్లు కాపురం చేసి, మోసం చేశాడు’ అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య అనే యువతి..
జూలై 5న పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య, 9వ తారీఖును రాజ్‌తరుణ్‌తో దిగిన 170 ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా సమర్పించింది. ఈ సాక్ష్యాలతో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే 3 రోజులుగా ఈ కేసును జనాలు మరిచిపోవడంతో మళ్లీ వార్తల్లో నిలిచేలా ఆత్మహత్యాయత్నం చేసింది లావణ్య..
YouTuber Praneeth Hanumantu : రూల్స్ మారాయి, రాతలు జాగ్రత్త! ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే అంతే..
‘రాజ్ తరుణ్ కేసులో దారుణంగా మోసపోయాను. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా. నా గురించి తెలిసినవాళ్లే నన్ను తప్పు బట్టారు. నా చావుకి రాజ్ తరుణ్, అతని ప్రేయసి మాల్వీ మల్హోత్రానే కారణం.’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది లావణ్య. అయితే ఆ తర్వాత 112కి కాల్ చేసింది. దీంతో పోలీసులు వచ్చి, ఆమెను కాపాడారు.
ఇదంతా చూస్తుంటే సినిమా ప్రమోషన్ కోసం రాజ్ తరుణ్ అండ్ గ్యాంగ్ చేస్తున్న దారుణమైన ఫ్రాంక్లా ఉందని కొందరు నెటిజన్లు అనుమానిస్తున్నారు. జనాలు ఈ సంఘటనను మరిచిపోయే సమయానికి మళ్లీ రాజ్ తరుణ్ గురించి డిస్కర్షన్ జరిగేలా లావణ్య ఏదో ఒకటి చేస్తుండడంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు.