Pushpa2 The Rule : 6 నిమిషాల సీన్‌కి రూ.60 కోట్లు..

Pushpa2 The Rule : అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ ఉంది. ఈ సినిమా ఎంత లేదన్నా రూ.1000 కోట్లు కొడుతుందని బన్నీ ఫ్యాన్స్ లెక్కేస్తున్నారు. ఈ సినిమాలో జాతర ఫైట్, టాలీవుడ్‌లోనే బెస్ట్ ఫైట్లలో ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు సుక్కూ అండ్ టీమ్..

అందుకే ఈ జాతర ఫైట్‌కి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌తోనే ప్రచారం చేస్తున్నారు. సినిమాలో 6 నిమిషాల పాటు ఉండే ఈ జాతర ఫైట్ కోసం ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టారట చిత్ర యూనిట్. దాదాపు 30 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగిందట. ఈ ఫైట్‌లో దాదాపు 2 వేల జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని, గంగమ్మ జాతర సెటప్‌‌ అదిరిపోతుందని టాక్.

Jagapathi Babu : ఆ మూవీకి చాలా కష్టపడ్డా.. చివరకు జోకర్‌ని చేశారు..

‘పుష్ఫ’ పార్ట్ 1 మొత్తంగా రూ.160 కోట్లు రాబడితే, ఈ సినిమాని రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ.200 కోట్ల వరకూ రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post