అల్లు అర్జున్ రైట్ హ్యాండ్ కేశవ అరెస్ట్.. జూనియర్ ఆర్టిస్ట్‌ని బ్లాక్‌ మెయిల్ చేసి..

Pushpa Actor Jagadeesh Arrested : ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ రైట్ హ్యాండ్‌ కేశవగా నటించి, ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులారిటీ తెచ్చుకున్నాడు జగదీశ్ ప్రతాప్ బండారి. ఓ బ్లాక్‌మెయిల్ కేసులో జగదీశ్‌ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం జగదీశ్, తనతో పని చేసిన ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో ప్రేమాయణం నడిపాడు. ఆమెతో ప్రైవేట్ ఫోటోలు కూడా దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

నేను, మీ ఇద్దరి కాళ్లు నాకుతాను!.. ఆర్జీవీ, ‘యానిమల్’ రివ్యూ చదవితే..

జూనియర్ ఆర్టిస్ట్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది. ‘పుష్ప 2: ది రూల్’ మూవీలో కూడా జగదీశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. లీకైన ఫోటోలను బట్టి, పుష్పరాజ్‌ని రైట్ హ్యాండ్ కేశవ వెన్నుపోటు పొడుస్తాడని కూడా కథనాలు వస్తున్నాయి. ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఈ సమయంలో జగదీశ్ అరెస్ట్ కావడం, ‘పుష్ప’ టీమ్‌కి షాకింగ్ వార్తే.

బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..

‘పుష్ప’ మూవీకి ముందు ‘మల్లేశం’, ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస’ వంటి మూవీల్లో కనిపించినా జగదీశ్‌కి పెద్దగా గుర్తింపు రాలేదు. ‘పుష్ప’ తెచ్చిన క్రేజ్‌తో హీరోగా ‘సత్తిగాడి రెండెకరాలు’ మూవీ కూడా చేశాడు. ‘పుష్ప’లో నటనకు గాను, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా SIIMA వార్డు కూడా గెలిచాడు జగదీశ్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post