Pushpa 2 Update : వెయ్యి ఎకరాల్లో సెట్.. ఒక్క రోజు షూటింగ్ కూడా చేయకుండా..

Pushpa 2 Update : ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ గురించి రోజుకో వార్త వస్తోంది. దర్శకుడు సుకుమార్, కుటుంబంతో కలిసి అమెరికా టూర్‌కి వెళ్లాడు. దీంతో షూటింగ్ వాయిదా పడింది. దానికి ముందు అల్లు అర్జున్ కూడా ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చాడు. సుకుమార్ వల్ల మళ్లీ షూటింగ్‌కి బ్రేక్ పడడంతో బన్నీకి కోపం వచ్చి, ‘పుష్ప’ మూవీ కోసం మూడేళ్లుగా పెంచుతూ వచ్చిన గడ్డాన్ని తీసేశాడు. గడ్డం లేకుండా బన్నీ యూరప్ టూర్‌కి వెళ్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.. ఇద్దరి మధ్య గొడవల కారణంగా ‘పుష్ప 2’ నిర్మాతలకు చాలా పెద్ద బొక్క పడుతోందని వార్తలు వచ్చాయి..

Anudeep KV : నెక్ట్స్ మూవీ ఎవరితో..

అయితే తాజాగా ‘పుష్ప 2’ సినిమాకి సంబంధించి మరో వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేశారట. ఓ ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఇక్కడ తీయాలని సుకుమార్ భావించాడట. ఈ సెట్ నిర్మించి, రెండు నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఇక్కడ ఒక్క షాట్ కూడా తీయలేదట.. రెండు నెలలుగా నిర్మాతలు, రామోజీ ఫిల్మ్ సిటీకి రెంట్ మాత్రం కట్టాల్సి వస్తోంది..

Prabhas : అల్లూరి సీతారామరాజుగా ప్రభాస్!

నిజానికి ఏప్రిల్‌లో ‘పుష్ప 2’ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తీయాలని అనుకున్నారు. అయితే ఫజల్ ఫాహద్ వేరే సినిమా షూట్‌లో బిజీగా ఉండడంతో డేట్స్ సర్దుబాటు కాలేదు. ఆ తర్వాత హీరో ఫారిన్ ట్రిప్‌కి వెళ్లడం, ఆయన వచ్చేశాక డైరెక్టర్ ఫారిన్‌కి వెళ్లడం, సుక్కూ తిరిగి వచ్చే టైమ్‌కి బన్నీ మళ్లీ ఫారిన్ టూర్ వెళ్లడంతో అప్పటి నుంచి ఇక్కడ తీయాల్సిన క్లైమాక్స్ సీన్స్ ఇంకా తీయలేదు. దీంతో నిర్మాతలకు ఖర్చు పెరుగుతూ పోతోంది. ఇప్పుడు హీరోగారి గడ్డం మళ్లీ పెరిగే దాకా నెలన్నరపాటు షూటింగ్‌కి బ్రేక్ పడినట్టే. ఆ లోపు ఎడిటింగ్ పనులు పూర్తి చేస్తాడట సుకుమార్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post