Pushpa 2 Teaser : టీజర్ అన్నారు, చిన్న ముక్క వదిలారు.. వాయిదా కన్ఫార్మ్ చేసినట్టేనా..

Pushpa 2 Teaser : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌గా నిలిచింది. టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండడంతో ఆంధ్రాలో ఈ మూవీకి భారీ నష్టాలు వచ్చాయి. అయితే హిందీ డబ్బింగ్ వర్షన్‌కి రూ.100 కోట్లు రావడంతో హిట్టు సినిమాగా నిలిచింది. ఏ మాత్రం ప్రమోషన్ లేకుండా హిందీలో రిలీజ్ చేసిన ‘పుష్ప’ మూవీ, రూ.100 కోట్లు రాబట్టిందంటే అది అల్లు అర్జున్ హిందీ యూట్యూబ్ డబ్బింగ్ సినిమాల ఎఫెక్టే.

ఈ సినిమాలో నటనకు బన్నీ నేషనల్ అవార్డు కూడా గెలిచాడు. దీంతో ‘పుష్ప 2’ మూవీపై హైప్ మామూలుగా లేదు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల అయ్యింది. టీజర్ అని చెప్పడం కంటే ఇది గ్లిప్స్ అని చెప్పడమే బెటర్ ఏమో… గంగమ్మ జాతర గెటప్‌, ఫైట్ సీన్‌లో కొన్ని షాట్స్ మాత్రమే రిలీజ్ చేసి టీజర్ అని సర్దిపెట్టుకోమనేసినట్టు ఉంది.

Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..

ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. 3 నెలల ముందు టీజర్ కట్‌కి కూడా సరైన ఫుటేజీ లేదంటే, అనుకున్న సమయానికి ఈ మూవీ రావడం అనుమానమే. ఒకవేళ ఆగస్టు 15న ‘పుష్ప’ సైడ్ అయితే ఆ ప్లేస్ కోసం చాలా సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అక్టోబర్‌కి వెళ్లిన ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో పాటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ వంటి సినిమాలు ఈ డేట్ కోసం కాచుకుని కూర్చున్నాయి.. అయితే టీజర్‌లో కూడా ఆగస్టు 15న ‘పుష్ప’ ఎంట్రీ ఉంటుందనే ప్రకటించారు. అయితే ఇంకా 30 శాతం దాకా షూటింగ్ బాకీ ఉందని టాలీవుడ్ టాక్. అదే నిజమైతే డేట్స్ అటు ఇటుగా కావడం పక్కా..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post