Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ మూవీకి మంచి హైప్ ఉంది. ‘పుష్ప 2: ది రూల్’, ఈ ఏడాది రూ.1000 కోట్లు వసూలు చేసే స్టామినా ఉన్న సినిమాగా చూస్తున్నారు ట్రేడ్ పండితులు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప 2’ మూవీ టీజర్ విడుదలైంది. మొదటి 32 గంటల్లో ఈ టీజర్ 43 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైక్స్ వచ్చాయి.
ఓవరాల్‌గా ప్రభాస్ సినిమాలు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’, ‘రాధే శ్యామ్’ తర్వాత అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది ‘పుష్ప ది రూల్’. అయితే పుష్ప మూవీకి ఉన్న క్రేజ్‌కి ఈ వ్యూస్ చాలా తక్కువ. దీంతో ఫేక్ వ్యూస్‌తో క్రేజ్‌ని డబుల్ చేయాలని చూసింది చిత్ర యూనిట్. 32 గంటల్లో 43 మిలియన్లు ఉన్న వ్యూస్, ఆ తర్వాత 2 గంటల్లోనే 85 మిలియన్లకు చేరాయి. 2 గంటల్లో 42 మిలియన్ల వ్యూస్ వస్తే, ఫేక్ వ్యూస్ అని జనాలు కనిపెట్టేస్తారని చిత్ర యూనిట్ ఆలోచించకపోవడం విశేషమే.
Pushpa 2 The Rule: అందుకే పుష్ప 2లో చీరలో బన్నీ..
ఇంతకుముందు సరైనోడు, దువ్వాడ జగన్నాథం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలోనూ ఈ ఫేక్ కలెక్షన్స్ వార్తలు వినిపించాయి. ఖాళీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టి, కలెక్షన్లు పెంచుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా టీజర్‌కి కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది..