Pushpa 2 postponed : పుష్పరాజ్ భయపడ్డాడా..!?

Pushpa 2 postponed
Pushpa 2 postponed

Pushpa 2 postponed : అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని అప్పుడెప్పుడో ప్రకటించారు. అయితే ఈ సినిమా అనుకున్న డేట్‌కి రావడం లేదట. దీనికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్ధతు ప్రకటించాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, కేవలం శిల్పా రవి, తన స్నేహితుడు కావడం వల్లే వచ్చానని కూడా చెప్పాడు.

అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, అటు జనసేన అభిమానులు, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. అల్లు అర్జున్‌పై గుర్రుగా ఉన్నాయి. ఛాన్స్ దొరికితే రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘పుష్ప 2’ని దింపడం రిస్కే. అందుకే నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమాని వాయిదా వేద్దామని చెబుతున్నారట..

Balakrishna : భువనేశ్వరికి ముద్దు పెట్టిన అన్న.. ‘యానిమల్’ మూవీతో పోలుస్తూ.. వైరల్ అవుతున్న వీడియో..

అయితే హీరో అల్లు అర్జున్ మాత్రం అదేం కుదరదు, అనుకున్న సమయానికి రావాల్సిందేనని పట్టుబడుతున్నాడట. అదీకాకుండా ‘పుష్ప 2’ సినిమాకి సంబంధించి ఇంకా 20 శాతం షూటింగ్ బాకీ ఉంది. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. రెండు నెలల్లో సినిమాని రెడీ చేయడం కాని పని, సుకుమార్ అంటున్నాడట. ఎలా చూసినా ఆగస్టు 15 నుంచి పుష్ప 2 వాయిదా పడడం ఖాయమేనని తెలుస్తోంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post