Pushpa 2 : పుష్ప కూడా కాపీయేనా! ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్..

Pushpa 2 : పాన్ ఇండియా లెవెల్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమా ‘పుష్ప ది రూల్’. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో ‘పుష్ప 2’ మూవీని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పార్ట్ 1లో క్లైమాక్స్‌లో ‘ఇది సార్ నా బ్రాండ్’ అంటూ తన చేతితో వీపున చరుచుకుంటాడు పుష్పరాజ్. ఇప్పుడు ఆ మేనరిజాన్ని స్టైల్‌గా మార్చి, వీపు దగ్గర చేతి గుర్తు ఉన్న షర్ట్‌‌ని ‘పుష్ప.. పుష్ప.. పుష్ప’ సాంగ్‌లో చూపించారు. దీనిపై కన్నడ సినిమా ఫ్యాన్స్ ఓ మీమ్ వైరల్ చేస్తున్నారు..

Pushpa Pushpa Song : అనుకున్న రేంజ్‌ని అందుకోలేకపోయిందా..

కన్నడ సూపర్ స్టార్ శివ్‌రాజ్‌కుమార్ హీరోగా ‘జోగి’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీలో శివ్‌రాజ్‌కుమార్ ఓ సీన్‌లో ఇది రకమైన చేతి గుర్తు ఉన్న షర్టును వేసుకుంటాడు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్, శివ్‌రాజ్‌కుమార స్టైల్‌ని కాపీ చేశాడంటూ ఉన్న మీమ్‌ని ‘జోగి’ చిత్ర డైరెక్టర్ ప్రేమ్ షేర్ చేశాడు. 2005లో వచ్చిన ‘జోగి’ సినమాని తెలుగులో ప్రభాస్‌, నయనతారలతో ‘యోగి’ పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు వీ.వీ. వినాయక్. కన్నడలో సూపర్ హిట్టైన ‘జోగి’ సినిమా, తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే సినిమాని ధనుష్‌, మీరా జాస్మిన్‌లతో తమిళ్‌లో రీమేక్ చేశాడు సురేష్ కృష్ట. అది కూడా డిజాస్టర్.

తెలుగు సినిమాలను రీమేక్ చేసి చెడగొట్టే కన్నడీగులు, ఈ మధ్య కొంతకాలంగానే డీసెంట్ సినిమాలు చేస్తున్నారు. అయితే ‘పుష్ప’ సినిమాని అప్పుడెప్పుడో వచ్చిన ‘జోగి’ సినిమా కాపీ అంటూ ఓ నెటిజన్ మీమ్ చేయడం, దాన్ని దర్శకుడు ప్రేమ్ షేర్ చేయడం మాత్రం అస్సలు సహించలేకపోతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post