Pushpa 2 Faces Setback :2024లో ఏ సినిమా అయినా రూ.1000 కోట్లు షూర్ షాట్ కొడుతుందంటే.. చాలామంది ‘పుష్ప 2’ పేరే చెబుతున్నారు.
కారణంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్న సినిమాలకు కేవలం టాలీవుడ్‌లోనే క్రేజ్ ఉంటే, ‘పుష్ప 2’ సినిమా కోసం బాలీవుడ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
‘పుష్ప 1’ తెలుగులో ఫ్లాప్ అయ్యింది. అయితే హిందీ డబ్బింగ్ సినిమా అన్యూహ్యాంగా భారీ వసూళ్లు సాధించి, మొత్తానికి ‘పుష్ప’ మూవీని హిట్టు సినిమాగా నిలబెట్టింది. ‘పుష్ప 2’ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ని రూ.200 కోట్లకు అమ్మేశారు కూడా..
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాని కొనుగోలు చేయడానికి డిస్టిబ్యూటర్లు భయపడుతున్నారు. కారణం నిర్మాతలు భారీ ధరను డిమాండ్ చేస్తుండడమే. ‘పుష్ప 1’ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.72 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
తెలంగాణలో హిట్టు అయితే, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో భారీ నష్టాలు తప్పలేదు. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాకి అంతకు మూడింతలు డిమాండ్ చేస్తున్నారు నిర్మాతలు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.200 కోట్లు అడుగుతున్నారట. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లనే ఊహించని ఫిగర్..
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ఎంత మార్కెట్ ఉన్నా, మరీ తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల షేర్ రాబట్టే మార్కెట్ అయితే అల్లు అర్జున్‌కి లేదు. అదీకాకుండా ఏపీ ఎలక్షన్లలో వైసీపీ తరుపున ప్రచారం చేసి, మెగా ఫ్యాన్స్‌కి మరింత దూరమయ్యాడు బన్నీ.
అదీకాకుండా అక్కడ తెలుగు దేశం, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా ‘పుష్ప 2’ సినిమాకి వ్యతిరేకంగా పనిచేయొచ్చు, ఇలా చూసకుంటే ‘పుష్ప 2’ సినిమాని కొనడమే రిస్కు.బాయ్ కట్ అల్లు అర్జున్ అని మెగా ఫ్యాన్స్ లో ట్రేండింగ్ లో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి చిన్న సైగ ఫ్యాన్స్ కి అందించిన బాయ్ కట్ అల్లు అర్జున్ ఊపందుకుంటుంది.
అలాంటిది నిర్మాత కోరుతున్న మొత్తం పెట్టి, కొంటే ఉన్నది అమ్ముకోవాల్సిందేనని భయపడుతున్నారట.. తెలంగాణలో బెనిఫిట్ షోలను రద్దు చేశారు. దీంతో ఇక్కడ కూడా వసూళ్లపై ప్రభావం పడనుంది.
డిస్టిబ్యూటర్లు ముందుకు రాకపోతే మైత్రీ మూవీ మేకర్స్, స్వయంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటోందని సమాచారం..