Vishwak Sen’s Movie Openings : ప్రతీ సినిమాకి వైవిధ్యం చూపించడం విశ్వక్ సేన్ స్పెషాలిటీ. విజయ్ దేవరకొండ మాదిరిగానే ప్రెస్ మీట్స్‌లో ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు విశ్వక్ సేన్. అయితే విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తప్పులు చేస్తుంటే, విశ్వక్ సేన్ మాత్రం చాలా జాగ్రత్తగా స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు. ‘గామి’ సక్సెస్ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ చేశాడు విశ్వక్ సేన్. ఈ సినిమా టీజర్‌కి, ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య రావడంతో ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీకి బీభత్సమైన పబ్లిసిటీ వచ్చేసింది.
బాలయ్య కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉండడం, స్టేజీ మీద అంజలిని నెట్టడం రెండూ కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇదే పెద్ద రచ్చ జరిగితే, ‘అది మందు బాటిల్ కాదు, దాన్ని CG చేశారని’ ప్రెస్ మీట్‌లో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ చేసిన కవరింగ్.. మీమ్స్‌గా మారి, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీకి పీక్ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈ పబ్లిసిటీ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..
దాదాపు 2 నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. విశ్వక్ సేన్ తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటాడు. ‘పాగల్’, ‘దాస్ కా దమ్కీ’ ప్రెస్ మీట్స్‌లోనూ విశ్వక్ సేన్ చేసిన అతి అంతా ఇంతా కాదు. అయితే ఇక్కడ ‘బాటిల్‌ని CG చేశారనే’ డైలాగ్ విశ్వక్ సేన్ చెప్పింది కాదు, నిర్మాత నాగవంశీ చెప్పాడు. ఫస్ట్ విశ్వక్ సేన్ అది జ్యూస్ బాటల్ అని చెప్పడానికి ట్రై చేశాడు, మధ్యలో నాగవంశీ కలగచేసుకుని CG చేశారని అన్నాడు. కాంట్రవర్శీ చేసి, కలెక్షన్లు పెంచుకోవడం నాగవంశీకి బాగా అలవాటు. ‘ గుంటూర్ కారం’ కూడా ఇలాగే నెగిటివ్ టాక్ వచ్చినా, 90 శాతానికి పైగా వసూళ్లు సాధించి, Semi Hit స్టేటస్ తెచ్చుకుంది.
‘గుంటూర్ కారం’ సక్సెస్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో మహేష్ బాబుకి ఎంత క్రెడిట్ దక్కుతుందో ప్రెస్ మీట్స్ పెట్టి, తన సినిమాని మరిచిపోకుండా జనాలకి గుర్తుచేస్తూ వచ్చిన నిర్మాత నాగవంశీకి కూడా అంతే క్రెడిట్ దక్కుతుంది..
Balakrishna Gangs of Godavari event : అవన్నీ CG చేశారు, బాలయ్య అంజలిని తోయలేదు..