PT SiR Review : తమిళ్‌లో మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలుగా మారే ట్రెండ్ చాలా రోజులుగా కొనసాగుతుంది. విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాశ్‌తో పాటు హిప్ హాప్ తమిళ ఆది కూడా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా వినూత్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ నటించిన లేటెస్ట్ మూవీ ‘PT Sir’.. మే 24న విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో తెలుగులో విడుదలైంది..
Tollywood vs Kollywood : పిచ్చి, వెర్రి, అంతకుమించి.. సోషల్ మీడియాలో టాలీవుడ్ vs కోలీవుడ్ రచ్చ..
కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ సామాజిక సందేశంతో రూపొందింది. హీరో జాతకంలో గండం ఉందని గ్రహించిన అతని తల్లి, భయపడుతూ ఓ పిరికి వాడిలా పెంచుతుంది. ఓ పెద్ద ప్రైవేటు స్కూల్‌లో పీటీ టీచర్‌గా పనిచేస్తూ ఉంటాడు హీరో.. అయితే ఆమె తల్లి భయాన్ని నిజం చేస్తూ హీరో, ఆ విద్యా సంస్థల అధిపతికి ఎదురెళ్తాడు.. తన ఇంటి పక్కన ఉండే ఓ అమ్మాయి (అనిఖా సురేంద్రన్), ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె చావుకి స్కూల్ ఛైర్మెన్ కారణమని తెలుసుకున్న హీరో ఏం చేశాడు? ఇదే సినిమా కథ…
సినిమా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగినా, సెకండాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టు అదిరిపోతుంది.. హీరోయిన్‌గా మారిన తర్వాత కూడా అనిఖా సెలక్ట్ చేసుకుంటున్న రోల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర చాలా కీలకం.. హీరోయిన్ కష్మిరా పర్దేశీ, ప్రభు, త్యాగరాజన్ ముఖ్యపాత్రల్లో నటించారు.
Prabhas : అల్లూరి సీతారామరాజుగా ప్రభాస్!
డైరెక్టర్ తీసుకున్న సబ్జెక్ట్ చాలా గొప్పదే, అయినా దాన్ని ఇంకా బాగా డీల్ చేయొచ్చు. లైంగిక వేధింపులను ఫేస్ చేసిన మహిళలను చూసే కోణాన్ని ప్రశ్నించిన డైరెక్టర్… ఆ పాయింట్‌ని మరింత గట్టిగా చూపించే ప్రయత్నం చేయలేకపోయాడు.