Prithviraj Sukumaran : బాలయ్యతో సినిమా చేస్తా! కథ కూడా రెఢీ చేసుకున్నా..

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ‘ఆడు జీవితం’ సినిమా ప్రమోషన్స్‌తో తెగ బిజీగా గడుపుతున్నాడు. మార్చి 28న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల అవుతోంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్’ మూవీని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్, తెలుగులో బాలయ్యతో సినిమా చేయబోతున్నాడట.

Prithviraj Sukumaran : మెగాస్టార్ స్వయంగా అడిగినా చేయనని చెప్పేశా..

‘బాలకృష్ణగారంటే నాకెంతో ఇష్టం. ఆయనతో ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నా. ఈ మధ్య దీని గురించి కాసేపు మాట్లాడాను కూడా.. ఆయన ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అయితే మలయాళ కమర్షియల్ సినిమాలో ఆయన్ని చూపించాలని అనుకుంటున్నా.. అయ్యప్పన్నం కోషియం లాంటి సినిమాలో బాలయ్యని చూపించాలని ప్లాన్ చేస్తున్నా…’ అన్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్.

ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, ‘సలార్ 2’ సినిమా గురించి మాట్లాడాడు. ‘సలార్ 1 మూవీలో మీరు చూసింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. అసలు కథ అంతా రెండో పార్ట్‌లోనే మొదలవుతుంది.. రెండో పార్ట్ చూశాక మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు..’ అంటున్నాడు పృథ్వీరాజ్ అకా వరదరాజు మున్నార్.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post