Prithviraj Sukumaran : మెగాస్టార్ స్వయంగా అడిగినా చేయనని చెప్పేశా..

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran : మలయాళంలో స్టార్ హీరో, డైరెక్టర్‌గా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్, ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు. పృథ్వీరాజ్ నటించిన ‘ఆడుకాలం’ (The Goat Life) సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్, మలయాళ రీమేక్‌ల గురించి కొన్ని కామెంట్లు చేశాడు.

Ram Charan : గేమ్ ఛేంజర్‌లో ముగ్గురు విలన్లు! శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

‘రెండు సార్లు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఆఫర్ వచ్చింది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి అడిగారు. సైరా నరసింహరెడ్డి సినిమాలో నేను నటించాల్సింది. అయితే వేరే సినిమా షూటింగ్‌లో ఉండడం వల్ల కుదరలేదు. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీలోనూ ఆఫర్ వచ్చింది.. నా మూవీ రీమేక్‌లో నేనే నటించడం కరెక్ట్ కాదని రిజెక్ట్ చేశాను.

ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా జనాలు సినిమాలు చూస్తున్నారు. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ రెండు సినిమాల బిట్స్‌ని చూశాను. చాలా రకాలుగా మార్చేశారని అనిపించింది. రీమేక్ సినిమాలు చూడడానికి జనాలు ఇష్టపడడం కూడా ఆపేశారు..’ అంటూ కామెంట్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post