Premalu Movie : తెలుగు ఆడియన్స్‌కి సినిమా నచ్చాలే కానీ, భాషతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారని చెప్పడానికి మలయాళ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’ సినిమానే ఉదాహరణ. ఈ సినిమా తెలుగులో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన మలయాళం సినిమాగా రికార్డులను సృష్టించింది. టాలివుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ, కన్నడ, మలయాళం సినిమాలపై ఒక లుక్కేద్దాం..
మలయాళ ‘ప్రేమలు’ తెలుగు వర్షన్ థియేటర్ల నుంచి రూ.15 కోట్లు పైగా వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో.. మలయాళం నుంచి తెలుగు డబ్ అయిన సినిమాల్లో ఇదే అత్యధికం. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కొడుకు కార్తికేయ, మలయాళంలో ఈ సినిమా చూసి, అతనికి తెగ నచ్చేయడంతో ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. దేశవ్యాప్తంగా రూ.140 కోట్లు పైగా వసూలు చేసింది ‘ప్రేమలు’ సినిమా..
Premalu Review : క్యూట్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ..
తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్ 2’. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులోనే రూ. 83 కోట్లు షేర్, రూ.147 కోట్లు గ్రాస్ వసూలు చేసి చరిత్ర తిరగరాసింది.. ‘కేజీఎఫ్’ పార్ట్ 1కి ముందు ఏ కన్నడ సినిమా కూడా తెలుగులో రూ.10 కోట్లు కూడా రాబట్టకపోవడం విశేషం.. ‘కేజీఎఫ్’ తర్వాత గత ఏడాది వచ్చిన ‘కాంతార’ మూవీ రూ.60 కోట్ల షేర్ సాధించి, రెండో స్థానంలో నిలిచింది.
టాలీవుడ్ లోనే అత్యధిక వసూలు సాధించిన హిందీ డబ్బింగ్ మూవీ ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమిల్’ మూవీ తెలుగులోనే రూ.38 కోట్ల షేర్, రూ. 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగువాళ్లకు మిగిలిన భాషా చిత్రాల కంటే తమిళ్ సినిమాలంటే బాగా ఇష్టం. ప్రతీ ఏడాది 30-40 తమిళ సినిమాలు, తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. ఇందులో తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య, విజయ్, ధనుష్, రజినీకాంత్, శివకార్తికేయన్, కమల్‌హాసన్ సినిమాలకు ఇక్కడ మంచి వసూళ్లు వస్తుంటాయి..
Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘2.0’ మూవీ, తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు దక్కించుకుంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో రూ.52 కోట్ల షేర్, రూ. 90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రజినీ ‘జైలర్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాలు, తమిళ్‌తో పాటు తెలుగులోనూ సమానంగా వసూళ్లు సాధించాయి.
సూర్య నటించిన ‘24’, కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలకు తమిళ్‌లో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.. తమిళ ప్రేక్షకులు మాత్రం తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకున్నది లేదు. రాజమౌళి సినిమాలు తప్ప, మిగిలిన తెలుగు నుంచి తమిళ్‌లోకి డబ్ అయిన సినిమాలు అక్కడ పెద్దగా ఆడిన రికార్డు లేదు.