Prathinidhi 2 Movie Review : ఆరేళ్ల తర్వాత నారా రోహిత్ కమ్‌బ్యాక్..

Prathinidhi 2 Movie Review : సినిమా, సినిమాకి వైవిధ్యం చూపించడం నారా రోహిత్‌కి అలవాటు. 2009లో ‘బాణం’ మూవీతో వచ్చిన నారా రోహిత్, ఇప్పటిదాకా చేసిన ప్రతీ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథా, కథనాలు ఉంటాయి. అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం శ్రీవిష్ణుతో కలిసి చేసిన ‘వీరభోగ వసంతరాయలు’ రిలీజ్ చేసిన నారా రోహిత్, అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు..

ఆరేళ్ల తర్వాత ‘ప్రతినిధి 2’ సినిమా రిలీజ్ చేశాడు నారా రోహిత్. పదేళ్ల క్రితం వచ్చిన ‘ప్రతినిధి’ మూవీకి ఇది సీక్వెల్. టీవీ రిపోర్టర్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తగిరి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్‌ ఘోష్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు..

Mamta Mohandas Strong Comments On Tollywood : టాలీవుడ్‌లో కథను పట్టించుకోరు, కష్టపడరు..!

ఓ రాజకీయ నాయకుడు ప్రమాదంలో చనిపోగానే, రాష్ట్రంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యల వెనకున్న అసలు గుట్టు తెలుసుకోవడానికి ఓ మీడియా ప్రతినిధి ప్రయత్నిస్తాడు. ఆ విచారణలో అతనికి తెలిసింది ఏంటి? ఆ నాయకుడిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఇదే పాయింట్ చుట్టూ ‘ప్రతినిధి 2’ తిరుగుతుంది..

డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఈ సినిమాలో పాత్రలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌లను తలపిస్తాయి. కథలో కొత్తదనం లేకపోయినా, కథనంలో కొత్తదనం కోసం ప్రయత్నించాడు మూర్తి. అయితే దర్శకుడిగా అతని అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ పెద్దగా హెల్ప్ కాలేదు.. నారా రోహిత్ నటుడిగా మరోసారి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే బరువు బాగా పెరిగిపోయి, చాలా బొద్దుగా కనిపించాడు..

‘ప్రతినిధి’ సినిమాలో నా 20 పైసల చిల్లర నాకు కావాలి? వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు లేవనెత్తి, మంచి పొలిటికల్ డ్రామా చూపించాడు ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ మండవ. అయితే ‘ప్రతినిధి 2’ మూవీలో మూర్తి, ‘సానుభూతి ఆత్మహత్యలు’ అనే పాయింట్‌ తీసుకుని, అలాంటి ప్రయత్నం చేసినా పూర్తిగా సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ రాసుకుని, దాని చుట్టూ సినిమాని చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post