Prasanna Vadanam Review : ‘కలర్ ఫోటో’తో హీరోగా మారిన సుహాస్, భిన్నమైన కథాంశాలతో సినిమాలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొడుతున్నాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ వంటి హిట్స్ తర్వాత గ్యాప్ లేకుండా ‘ప్రసన్నవదనం’ మూవీని థియేటర్లలోకి తెచ్చేశాడు సుహాస్…
హీరో చిన్నప్పుడే అమ్మనాన్నలను కోల్పోతాడు. యాక్సిడెంట్ కారణంగా అతని ఫేస్ బ్లైండ్ నెస్ సమస్య వస్తుంది. అంటే తన ముందున్న వ్యక్తి ముఖాన్ని హీరో అస్సలు గుర్తుపట్టలేడు. అంతెందుకు తన ముఖం ఎలా ఉంటుందో కూడా హీరోకి తెలీదు. అలాంటి హీరో, ఓ మర్డర్ మిస్టరీకి ప్రత్యేక్ష సాక్షిగా మారతాడు. ఆ మర్డర్ చేసింది ఎవరు? ముఖం గుర్తుపట్టలేని హీరో, ఆ హంతకుడిని ఎలా పట్టించగలిగాడు? ఇదే ‘ప్రసన్నవదనం’ మూవీ కాన్సెప్ట్..
Hari Hara Veeramallu Teaser : టీజర్ దిగింది.. డైరెక్టర్ మారాడు..
ప్రతీ సినిమాకి వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ దూసుకుపోతున్న సుహాస్, ఈసారి తన నుంచి ప్రేక్షకులు ఆశించే డ్రామాని అందించడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. నటుడిగా సుహాస్ మరోసారి తన టాలెంట్ చూపించేశాడు. ‘ప్రసన్నవదనం’ మూవీకి అతని యాక్టింగ్ కూడా ఓ ప్రధాన ప్లస్ పాయింట్..
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కంటే పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఫేమ్ రాశీ సింగ్ కూడా యాక్టింగ్‌లో, గ్లామర్‌లో ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. మిగిలిన నటులు కూడా చక్కగా నటించారు. థ్రిల్లర్‌కి ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ విషయంలో విజయ్ బుల్గనిన్ సూపర్ సక్సెస్ అయ్యాడు.
Malavika Mohanan : ఎప్పటికీ యాక్టింగ్ చేయను! నీకేంటి ప్రాబ్లెమ్… నెటిజన్‌కి మాళవిక మోహనన్ కౌంటర్..
డైరెక్టర్ అర్జున్ వైకే తాను రాసుకున్న కాన్సెప్ట్‌ని తెర మీద అనుకున్నట్టుగా ఆవిష్కరించడంతో మంచి మార్కులు కొట్టేశాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర పనిచేసిన అర్జున్, మిస్టరీ థ్రిల్లర్స్‌లో ఎమోషన్స్, హీరోకి ఫేస్ బ్లైండ్ నెస్ వంటి కాన్సెప్ట్ జోడించి, ప్రేక్షకులకు కొత్త ఫీల్ అందించాడు..