Prabhutva Junior Kalasala Movie Review: మరో ‘బేబీ’..

Prabhutva Junior Kalasala Movie Review
Prabhutva Junior Kalasala Movie Review

Prabhutva Junior Kalasala Movie Review : ట్రైలర్‌తో యూత్‌లో మంచి అటెన్షన్ దక్కించుకున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ మూవీ.. దాదాపు అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదలైంది.. వాస్తవిక కథాంశంతో తెరకెక్కిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎలా ఉందంటే..

టీనేజ్ వయసులో ప్రేమ, రొమాన్స్, బ్రేకప్.. ఇలాంటి సింపుల్ స్టోరీతో యూత్‌కి నచ్చే సన్నివేశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ను నింపేశారు. అయితే చిత్తూరు యాసలో సాగే ఈసినిమాలో చాలా సీన్లు, ‘బేబీ’, ‘పుష్ప’ సినిమాలను గుర్తుకు తెస్తాయి. కొత్త వాళ్లు అయినా నటీనటులు అందరూ చక్కగా నటించారు..

Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..

ఒకే ఊర్లో సినిమా మొత్తం ముగించేశారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, పాటలు ఆకట్టుకుంటాయి. అయితే ‘బేబీ’లో కనెక్ట్ అయిన ఎమోషనల్ సీన్స్, ఇందులో పెద్దగా వర్కవుట్ కాలేదు. రొటీన్ సీన్స్‌తో సాధారణంగా సాగుతుంది. కాలేజీలకు వెళ్లేవాళ్లు, టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి.

శ్రీనాథ్ పులకురం కథతో పాటు ఎడిటర్‌, డైరెక్టర్‌గా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన కమ్రాన్ కారణంగా ఈ సినిమాని టైమ్ పాస్ మూవీగా నిలిపాయి.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post