Prabhas Spirit Story : ప్రభాస్ స్పిరిట్ కథను రివీల్ చేసిన డైరెక్టర్..

Prabhas Spirit Story : రెండే రెండు సినిమాలతో ఇండియాలో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే హైప్ పెంచే పనిలో పడ్డాడు సందీప్ రెడ్డి వంగా..

‘నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత ప్రభాస్, నా దగ్గరికి సినిమా చేయాలని వచ్చాడు. అయితే ఓ హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని చెప్పాడు. నాకు రీమేక్స్ నచ్చవు. నా దగ్గరే ఓ ఐడియా ఉందని చెప్పాను. అది ఆయనకి బాగా నచ్చింది. ఇప్పటికే 60 శాతం స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యింది. ఈ డిసెంబర్‌లో షూటింగ్ మొదలు పెడతాం..

Prabhas New Name : లక్ కోసం పేరు మార్చుకున్న ప్రభాస్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో..

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, తన వల్ల ఓ తప్పు జరిగిందని తెలిస్తే ఏం చేస్తాడు? ఆ తప్పును ఎలా సరిదిద్ధుకున్నాడు. దానికి అడ్డొచ్చిన వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే స్పిరిట్ కథ. ఇందులో హీరో పక్కా మిడిల్ క్లాస్ మ్యాన్.. ఓ కొత్త టేకింగ్‌ని చూస్తారు..’ అన్నాడు సందీప్ రెడ్డి వంగా.

ప్రస్తుతం ‘కల్కి 2898AD’ షూట్ పూర్తి చేసిన ప్రభాస్, మారుతితో ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది డిసెంబర్‌లో లేదా జనవరిలో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ‘స్పిరిట్’ మొదలైతే, ‘సలార్ 2’ పరిస్థితి ఏంటి? ‘కల్కి 3102 BC’ పరిస్థితి ఏంటి? మధ్యలో హను రాఘవపూడి సినిమా ఎప్పుడు వస్తుంది?

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post