Prabhas Salaar : ప్రభాస్, ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ, కలెక్షన్ల మోత మోగిస్తూ సాగుతోంది. 11 రోజుల్లో రూ.625 కోట్ల వసూళ్లు సాధించిన ‘సలార్’ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.. రాజమౌళి ‘బాహుబలి 1’ని దాటేసిన ‘సలార్’, ‘బాహుబలి 2’, ‘RRR’ తర్వాతి స్థానంలో నిలిచింది. ‘బాహుబలి 2’ రిలీజ్ తర్వాత టాప్ 2లో ఓ నాన్- రాజమౌళి నిలవడం ఇదే తొలిసారి..
Venu Swamy : 2024లో ఓ సూపర్ స్టార్ ఆరోగ్య సమస్యలతో సినిమాల నుంచి తప్పుకుంటాడు..
కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ‘సలార్’. ఇంతకుముందు RRR మూవీ, కెనాడాలో 1.44 మిలియన్లు వసూళ్లు చేసింది. అంతకుముందు బాహుబలి 2 మూవీ, 1 మిలియన్‌కి బాగా దగ్గరిగా వచ్చింది. 11 రోజుల్లోనే ‘సలార్’ మూవీ 1.45 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది..
హిందీలో రూ.101 కోట్ల వసూళ్లు దాటేసిన ‘సలార్’, రూ.150 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. న్యూఇయర్ రోజున దాదాపు 50 శాతం ఆక్యుపెన్సీతో ‘సలార్’ మూవీకి చాలా చోట్ల హౌస్‌ఫుల్ షోస్ పడ్డాయి. అయితే ‘సలార్’ బ్రేక్ ఈవెన్ దాటాలంటే ఇంకో రూ.20 కోట్ల వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది..
Shobu Yarlagadda : సినిమా సరిగ్గా తీయడమే కాదు, సరిగ్గా ప్రమోట్ చేయడమూ తెలియాలి..
జనవరి 12 వరకూ పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ఇంకో రెండు వారాలు ఇదే జోరు కొనసాగిస్తే.. ‘సలార్’ హిట్ మార్కు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆంధ్రాలో మాత్రం ఈ మూవీ, భారీ నష్టాలనే మిగిల్చేలా కనిపిస్తోంది.