తెల్లవారుజామున 4 గంటలకు, అర్ధరాత్రి 1 గంటకి… ‘సలార్’ షో టైమ్స్‌ మామూలుగా లేవుగా..

Prabhas Salaar Movie Show Timings : ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, ఆ రోజు వేరే సినిమాలను రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడేవాళ్లు. అయితే ‘సలార్’‌కి అలాంటి రిలీజ్ దక్కడం లేదు. షారుక్ ‘డంకీ’తో వస్తుంటే, హాలీవుడ్ సూపర్ స్టార్ మూవీ ‘అక్వామ్యాన్’ కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి.

ఇది మా సినిమా! మా ప్లేస్… ‘సలార్’కి ఛాలెంజ్ చేస్తున్న కన్నడ హీరో దర్శన్..

దీంతో బడ్జెట్‌కి వీలైనంత త్వరగా వెనక్కి రాబట్టేందుకు ‘సలార్’ చిత్ర యూనిట్, భారీ ప్లానింగ్ వేస్తోంది. తెలంగాణలో రిలీజ్ రోజు నాలుగు కాదు, ఐదు కాదు.. ఏకంగా ఆరు, ఏడు షోలు ప్రదర్శించేందుకు అనుమతి తీసుకుంది. తెల్లవారు జామున 4 గంటల నుంచి ‘సలార్’ బెనిఫిట్ షోస్ మొదలు కాబోతున్నాయి. అలాగే అర్ధరాత్రి 1 గంటకు కూడా ఓ స్పెషల్ షో వేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?

అలాగే టికెట్ల ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయి. హైదరాబాద్‌లోని మల్లీప్లెక్సుల్లో టాక్సులతో కలిపి దాదాపు రూ.440, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ట్యాక్సులతో కలిపి రూ.210 వరకూ టికెట్ల ధరలు ఉండబోతున్నాయి. రెండో వారంలో ఈ ధరలు మహా అయితే రూ.50 మాత్రమే తగ్గుతాయి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post