Prabhas Salaar Movie : ‘సలార్’ సినిమా సెన్సార్ ముగిసింది. రక్త పాతం ఏరులై పారే ఫైట్స్ నిండుగా ఉండడంతో ఈ మూవీకి ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ టీమ్. ‘మిర్చి’ మూవీ తర్వాత ప్రభాస్ మూవీకి ఏ సర్టిఫికెట్ దక్కడం ఇదే తొలిసారి. మిర్చిలో ఫైట్స్ కారణంగానే ఏ సర్టిఫికెట్ వచ్చింది. మధ్యలో ప్రభాస్ చేసిన సినిమాలన్నీంటికీ U/A సర్టిఫికెట్ దక్కింది. చివరి సినిమా ‘ఆదిపురుష్’ అయితే సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ దక్కించుకుంది.
సలార్ డార్లింగ్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందా..!?
‘మిర్చి’ తర్వాత ‘బాహుబలి’ సినిమా కోసం నాలుగేళ్లు కేటాయించిన ప్రభాస్, వరుసగా మూడు ఫ్లాపులు ఫేస్ చేశాడు. ‘సాహో’ యావరేజ్‌గా ఆడినా ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ అయితే డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ‘సలార్’పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ‘మిర్చి’కి ముందు ‘రెబల్’ వంటి డిజాస్టర్ ఫేస్ చేశాడు ప్రభాస్. దీంతో వరుసగా రెండు ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌ని ‘సలార్’ గట్టెక్కిస్తుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ‘సలార్’… ‘కేజీఎఫ్’తో లింక్..
శృతి హాసన్ హీరోయిన్గా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసినా పాటలు ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. దీంతో ‘సలార్’ ఈసారి అయినా టైమ్‌కి వస్తుందా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నాయి. ‘సలార్’ రన్ టైమ్‌ని 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా లాక్ చేశారు.