Prabhas remuneration for Salaar movie : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ కేవలం తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్, పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అయితే బాహుబలి తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు ప్రభాస్. ‘సాహో’ పర్వాలేదనిపించినా, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’పైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇది మా సినిమా! మా ప్లేస్… ‘సలార్’కి ఛాలెంజ్ చేస్తున్న కన్నడ హీరో దర్శన్..
‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ‘సలార్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు దగ్గట్టే నీల్ మావ డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ముందుగా చెప్పినట్టుగానే కొన్ని సీన్స్, ‘ఉగ్రం’ మూవీ నుంచి రీమేక్ చేశాడు ప్రశాంత్ నీల్. దేవగా ప్రభాస్ క్యారెక్టర్, స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ‘రాధేశ్యామ్’,‘ఆదిపురుష్’లో ప్రభాస్‌ని చూసి తెగ ఫీలైపోయిన ఫ్యాన్స్‌కి, ఈ ‘సలార్’ ఓ జంబో బిర్యానీలాంటిదే.
యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్. ఆరంభంలో 20 నిమిషాలు, ఆడియెన్స్‌ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. కోల్ మైన్ ఫైట్‌తో పాటు, ఇంటర్వెల్ సమయంలో 20 నిమిషాల యాక్షన్ బ్లాక్, నారంగ్ ఎపిసోడ్ అదిరిపోతాయి. ‘సలార్’ సినిమాకి ప్రాణం కూడా ఇవే.
సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఇదేనా..
బాలీవుడ్ బాద్షాకు పోటీగా వచ్చిన సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ను దున్నేస్తుంది. ఈ క్రమంలో సలార్ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. మూవీ బడ్జెట్ 300 – 400 కోట్లు కాగా అందులో 100 కోట్లు ప్రభాస్ రెమ్యూనరేషన్ అని టాక్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు దాదాపు రూ.50 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.