Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ తర్వాత ప్రభాస్, త్రిష పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ‘వర్షం’ తర్వాత ఈ ఇద్దరూ ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఈ ప్రేమకథ ముందుకు సాగలేదు. ఆ తర్వాత ‘మిర్చి’ నుంచి ప్రభాస్- అనుష్క లవ్ స్టోరీ గురించి ఇండస్ట్రీ మొత్తం కోడైకూసింది. ‘బాహుబలి’ తర్వాత ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రకరకాల పుకార్లు వచ్చాయి.
అయితే ఈ ప్రేమకథలో నిజం ఎంతో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. లేటెస్ట్ ‘ఆదిపురుష్’ సమయంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య ప్రేమాయణం సాగిందని, ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే ‘ఆదిపురుష్’తో పాటు ఈ లవ్ స్టోరీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ప్రభాస్, ‘నాని గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌తో ‘లవ్’లో పడ్డాడట.
హను రాఘవపూడితో ప్రభాస్ రొమాంటిక్ మూవీ.. మరో ‘రాధేశ్యామ్’ కాదుగా..
అయితే ఇది పుకారు కాదు, నిజం. ‘ఆదిపురుష్’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సలార్’ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్‌తో ‘కల్కీ’, మారుతితో ‘రాజా డీలక్స్’ చేస్తున్న ప్రభాస్, హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ని సెలక్ట్ చేశారట. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి ‘లవ్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అలా ప్రియాంక మోహన్, ప్రభాస్ ఇద్దరూ ‘లవ్’లో ఉన్నారు.
బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..