Prabhas : హను ప్రేమ కథలో.. ప్రభాస్ జోడిగా మృణాల్ ఠాకూర్..

Prabhas : తెలుగులో మృణాల్ ఠాకూర్ ఇప్పటిదాకా చేసింది రెండే సినిమాలు. ‘సీతా రామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృఠాల్, ఆ తర్వాత నానితో కలిసి ‘హాయ్ నాన్న’ సినిమా చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ తన నటనతో అందర్నీ ఇంప్రెస్ చేసి, తెలుగువాళ్లకు ఫెవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ చేస్తోంది మృణాల్ ఠాకూర్..

Vishwak Sen Gaami : మినిమం గ్యారెంటీ హీరోగా విశ్వక్ సేన్..

ఈ సినిమా రిలీజ్‌కి ముందే మృణాల్‌కి ఓ అదిరిపోయే ఛాన్స్ దక్కినట్టు సమాచారం. ‘సీతా రామం’ సినిమాని తెరకెక్కించిన హను రాఘవపూడి, ప్రభాస్‌తో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. అయితే ప్రభాస్ కటౌట్ ముందు శ్రీలీల తేలిపోతుందని ఆమెను తప్పించిన హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్‌ని ఫైనల్ చేశాడట..

అయితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ మూవీ చేస్తున్న ప్రభాస్, మరో వైపు మారుతితో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల ‘సలార్ 2’ సినిమా షూట్ మొదలుకానుంది. అలాగే ‘కల్కి’ సినిమా కూడా 3 పార్టులుగా రానుంది. మరోవైపు సందీప్ రెడ్డి కూగా ‘స్పిరిట్’ సినిమా పనులు మొదలెట్టాడు. దీంతో హను-ప్రభాస్ సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకో రెండు మూడేళ్లు ఈజీగా పట్టొచ్చు.

Prabhas Kalki 2898AD : కల్కి నిండా స్టార్లే! నాగ్ అశ్విన్ పెద్ద రిస్కే చేస్తున్నాడా..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post