Prabhas : ప్రభాస్ పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ..

Prabhas : 44 ఏళ్లు వచ్చినా ప్రభాస్ ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. అప్పుడెప్పుడో ‘బాహుబలి’ సినిమాకి ముందే ప్రభాస్ పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు ప్రయత్నించారు. అయితే ఆ సినిమా అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వెయిట్ చేశారు. ‘బాహుబలి’ రెండు పార్టులుగా రిలీజ్ కావడం, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం, ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ యావరేజ్‌గా ఆడినా, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ డిజాస్టర్లుగా మిగలడం జరిగిపోయాయి. అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు..

ఇక ప్రభాస్ పెళ్లి చేసుకోడని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఈ సమయంలో సడెన్‌గా ‘డార్లింగ్స్..!! ఆఖరికి మన జీవితంలోకి చాలా స్పెషల్ పర్సన్ ఎంటర్ కాబోతున్నారు.. వెయిట్ చేయండి’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు ప్రభాస్. ఈ స్టేటస్‌ దేని గురించి? ఏదైనా మూవీ ప్రమోషన్ గురించా? లేక ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాడా? లేక నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా? ఈ విషయాలేమీ చెప్పలేదు.. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫైనల్లీ అంటున్నాడంటే పెళ్లి గురించే అయ్యి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

Prabhas : ప్రభాస్‌కి కథ చెప్పి, దీనికి మీరు సూట్ అవ్వరని చెప్పిన డైరెక్టర్..

మరోవైపు ఇదే సమయంలో ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా ‘నేను ఎవరో ఒకరికి డార్లింగ్.. ఎవరో తెలుసా?’ అంటూ ఓ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్టుల్లో ‘డార్లింగ్’ ఒక్కటే కామన్. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ కూడా నటించబోతుందా? అందుకే ఈ రకంగా ఇద్దరూ పోస్టులు చేస్తున్నట్టు సమాచారం..

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. స్వీటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకుంటాడని అనుకున్న ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్ అన్ని సామాజిక మాధ్యామాల్లో ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్ స్టోరీలే హాట్ టాపిక్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post