Prabhas : అల్లూరి సీతారామరాజుగా ప్రభాస్!

Prabhas
Prabhas

Prabhas : మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చింది. ఈ సినిమా తర్వాత అల్లూరి సీతారామరాజుగా చేయాలని చాలా మంది ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. సీనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలని అనుకుంటూ ఉన్నప్పుడే కృష్ణ ఈ సినిమా మొదలెట్టి, రిలీజ్ చేశారు..

‘RRR’ సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటించాడు. అయితే ఈ సినిమాలో చెర్రీ పాత్ర కేవలం పేరుకి మాత్రమే సీతారామరాజు, అల్లూరి రియల్ లైఫ్‌కి సంబంధించింది కాదు. పూర్తిగా కల్పిత పాత్రతో ‘RRR’ మూవీ రూపొందించాడు రాజమౌళి.. అల్లూరి సీతారామరాజుగా ప్రభాస్ నటిస్తే బాగుంటుందని ఆయన పెద్దమ్మ శ్యామలా దేవీ అభిప్రాయ పడింది.

Prabhas : రాముడు చేయలేకపోయిన పనిని, కర్ణుడు చేశాడు..

‘ప్రభాస్, అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. సీతారామరాజు పాత్రకి తిరిగి ప్రాణం పోయగల రూపం ప్రభాస్‌కి ఉంది. నాతో చాలా మంది అభిమానులు, ఈ విషయం చెప్పారు. నేను ఈ విషయాన్ని ప్రభాస్‌కి చెప్పి చూస్తాను. ఈ ప్రాజెక్ట్ రూపం దాల్చేలా కచ్ఛితంగా ప్రయత్నిస్తా…’ అని చెప్పుకొచ్చాడు కృష్ణంరాజు భార్య శ్యామలా దేవీ..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post