Prabhas New Name : లక్ కోసం పేరు మార్చుకున్న ప్రభాస్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో..

Prabhas New Name
Prabhas New Name

Prabhas New Name : ‘ఈ రోజుల్లో’ మూవీతో డైరెక్టర్‌గా మారిన మారుతికి న్యూమారాలజీ అంటే చాలా పిచ్చి. న్యూమారాలజీని బట్టి రిలీజ్ చేయడం వల్లే ‘ప్రతి రోజూ పండగే’, ‘పక్కా కమర్షియల్’ మూవీస్‌కి నెగిటివ్ టాక్ వచ్చినా, లాభాలు వచ్చాయని అంటాడు మారుతి. ఈ సెంటిమెంట్‌ని హీరో ప్రభాస్‌కి కూడా ఎక్కించాడట మారుతి.

Prabhas Salaar : ‘బాహుబలి’ మూవీని దాటేసిన ‘సలార్’.. మిగిలింది ఆ రెండే..

ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898AD’ మూవీ చేస్తున్న ప్రభాస్, డైరెక్టర్ మారుతితో ఓ హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేసి, లుంగీలో ఉన్న వింటేజ్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రతీ నెలా ఓ అప్‌డేట్ రిలీజ్ చేస్తానని మాటిచ్చాడు డైరెక్టర్ మారుతి.

Kushitha Kallapu – Guntur Kaaram : ఖుషిత పాపకు అన్యాయం చేసిన గురూజీ.. ‘గుంటూర్ కారం’లో కీ రోల్ అని చెప్పి..

అయితే ఈ చిత్ర పోస్టర్‌లో ప్రభాస్ పేరులో ఓ ఎక్స్‌ట్రా S ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. Prabhas తన పేరుని PrabhaSS అని మార్చుకున్నాడని.. లక్ కోసం ఎక్స్‌ట్రా ఎస్ చేర్చాడని అనుమానిస్తున్నారు అభిమానులు. ప్రభాస్ లుక్ బాగున్నా, ఫేస్ ఎడిటింగ్ సెట్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి. ‘కల్కి 2898AD’ మూవీ తర్వాత ‘సలార్’ పార్ట్ 2 చేస్తున్న ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ కూడా చేయబోతున్నాడు.

https://www.facebook.com/Raamulamma.Afire?mibextid=ZbWKwL

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post