Prabhas : ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్… ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో స్పెషల్ సాంగ్..

Prabhas : స్టార్ హీరోలు ఒక్క హీరోయిన్‌తో సినిమాలు చేయడం ఎప్పుడో మానేశారు. స్టార్ హీరో సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఇద్దరు హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేసే సాంగ్స్ కూడా చాలా కామన్. అయితే ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో డ్యాన్స్ చేసే స్పెషల్ సాంగ్స్ మాత్రం తక్కువే. ‘హాలో బ్రదర్’ మూవీలో నాగార్జున, ‘కన్నె పిట్టరో’ సాంగ్‌లో ఆమని, రంభ, ఇంద్రజ వంటి టాప్ హీరోయిన్లతో చిందులేశాడు..

ఆ తర్వాత ‘యమదొంగ’ మూవీలో ఎన్టీఆర్, నవ్‌నీత్ కౌర్, అర్చన, ప్రీతి జింగానియాతో డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం ఇలాంటి స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ మారుతి.. ‘కల్కి 2898AD’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్, ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’ మూవీ చేస్తున్నాడు..

హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు రాజ్‌తరుణ్‌తో ‘లవర్’ సినిమాలో నటించిన రిద్ధి కుమార్ ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేసిన రిద్ధి కుమార్, ‘ది రాజా సాబ్’లో గ్లామరస్ రోల్‌లోనే కనిపిస్తుందని టాక్..

ఈ ముగ్గురు భామలతో ప్రభాస్ కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఈ పాట, ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ మాస్ సాంగ్‌లా ఉంటుందని గట్టిగా టాక్ వినబడుతోంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రభాస్‌ని ఇంతకుముందెన్నడూ చూడని క్యారెక్టర్‌లో చూస్తారని ప్రకటించాడు డైరెక్టర్ మారుతి..

Prabhas Spirit Story : ప్రభాస్ స్పిరిట్ కథను రివీల్ చేసిన డైరెక్టర్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post