Prabhas : ప్రభాస్ కెరీర్‌లో పీక్ స్టేజ్ అయిపోయింది, ఇక కష్టం! ఆయన కెరీర్‌లో హిట్లు కొట్టలేడు. మళ్లీ ఈశ్వర్‌లా చిన్న చిన్న సినిమాలు తీస్తే తప్ప, ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు జాతకాలు చూపించాల్సిందే.. ప్రభాస్ గురించి ఓ సెలబ్రిటీ జ్యోతిషుడు చెప్పిన మాటలివి.. ‘కల్కి 2898AD’ సినిమా పెద్దగా ఆడదు, దీపికా పదుకొనే లక్ వల్ల నష్టాలు రాకపోవచ్చు కానీ లాభాలు రావడం మాత్రం కష్టం.. ఓ బాలీవుడ్ పండితుడి కామెంట్స్ ఇవి.. జ్యోతిష్యాలు, జాతకాల లెక్కలు, అన్నింటినీ ‘కల్కి’ తారుమారు చేశాడు..
Kalki 2898AD Movie Collections : కల్కి కలెక్షన్ల సునామీ..
జూన్ 27న విడుదలైన ‘కల్కి 2898AD’ మూవీ, జూలై మొదటి వారంలో లాభాల్లోకి వచ్చేసింది. ఇప్పటికే రూ.750 కోట్ల గ్రాస్, రూ.390 కోట్ల షేర్ దాటేసిన ‘కల్కి 2898AD’ మూవీ, ఓవర్‌సీస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలోనే 14.2 మిలియన్లు దాటిన కల్కి, పూర్తి రన్‌లో ఈజీగా 18 మిలియన్ల దాకా వెళ్లేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే ‘బాహుబలి’ 20.77 మిలియన్ల రికార్డు మాత్రమే మిగులుతుంది. షారుక్ ‘పఠాన్’, ‘జవాన్’, సందీప్ రెడ్డి ‘యానిమల్’, రాజమౌళి ‘RRR’ సినిమాల కలెక్షన్లన్నింటినీ దాటేయనుంది ‘కల్కి 2898AD’..
ప్రభాస్, శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ భారీ నష్టాలు మిగిల్చింది. ‘సలార్’ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చినా, కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఓం రౌత్ క్రియేట్ చేసిన శ్రీరాముడు చేయలేకపోయిన పనిని, నాగ్ అశ్విన్ సృష్టించిన కర్ణుడు చేసి చూపించేశాడు. ‘బాహుబలి 2’ తర్వాత ఆ రేంజ్ హిట్టు అందుకున్న ప్రభాస్, రూ.1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెట్టిస్తున్నాడు.
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
రెండో వీకెండ్ తర్వాత సినిమా టికెట్లపై హైక్ తీసివేయబోతున్నారు. వచ్చే సోమవారం నుంచి టికెట్ల ధరలు తగ్గుతాయి. దీంతో కలెక్షన్లు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్లు చేరుకుంటుందా? లేక దగ్గరగా వెళ్లి, ఆగిపోతుందా? అనేది వచ్చే వారంలో తెలుస్తుంది..