Postal Ballot Voting : మే 9న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఏకంగా 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు 26 వేలు.. మొత్తం 4.7 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఏపీ ఎలక్షన్స్ చరిత్రలోనే ఇది అత్యధికం.
పోల్ అయిన ఓట్లు అంచనా ఇంచు మించుగా ఇలా ఉంది. సచివాలయ ఉద్యోగులు 1.1 లక్షలు. వీరిలో 80% శాతం వైసీపీ, 20% తెదేపాకి వేసి ఉంటారని అంచనా. అంటే 88 వేల ఓట్లు వైసీపీకి, 22 వేలు టిడిపికి పోల్ అయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు, అంగన్వాడీ బ్యాంకు ఉద్యోగులు కలిపి 3.6 లక్షలు. అయితే వీరి సపోర్ట్ మాత్రం తెలుగుదేశానికి ఉన్నట్టు తెలుస్తోంది. 75% టిడిపికి, 25% వైసీపీకి పడొచ్చని అంచనా. అంటే 2.7 లక్షలు టీడీపీ, 90 వేల మంది వైసీపీ వైపు మొగ్గు చూపించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
AP Election 2024 : అందరి చూపు ఏపీ వైపే! అమాంతం పెరిగిన బస్ ఛార్జెస్..
మొత్తంగా చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వం వైపు దాదాపు 3 లక్షల మంది మద్దతు చూపిస్తున్నారు. వీరితో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కలిపి దాదాపు 6-8 లక్షలు ఉండొచ్చు. ఇక టీచర్లు, సచివాలయ ఉద్యోగులు మినహా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనని మిగతా ఉద్యోగులు, పెన్షనర్లు, దాదాపు కొంచెం అటు ఇటుగా ఇదే సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరివి కలిపి దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంట్ మొదలు అవుతుంది.
ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా రిజల్ట్ డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.