Poonam Pandey Death : మనిషి జీవితానికి విలువ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, చావుకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు చావు కూడా పెద్ద జోక్ అయిపోయింది. ఫలానా హీరో కొన్ని రోజులు ఎక్కడా కనిపించకపోతే చాలు, చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు జనాలు. హీరో సిద్ధార్థ్ దగ్గర్నుంచి సీనియర్ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఇలాంటి ఫేక్ డెత్ వార్తలతో బాధపడిన వాళ్లే. వేరే వాళ్లు ఇలాంటి చావు వార్తలు సృష్టిస్తే ఫీల్ అయ్యేవాళ్లను చాలామందిని చూసి ఉంటాయి.
Tamil Actor Vijay : రాజకీయాల్లోకి విజయ్.. పార్టీ పెట్టి, సినిమాలకు ఫుల్ స్టాప్..
అయితే బాలీవుడ్ నటి పూనమ్ పాండే మాత్రం స్వయంగా తన చావు మీద తానే ఫేక్ న్యూస్ వేసుకుంది. ఫిబ్రవరి 2న పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయిందంటూ ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేశారు. దీంతో పాపం పూనమ్ పాండే, 32 ఏళ్లు కూడా పూర్తిగా నిండకుండానే ప్రాణాలు విడిచిందా? అంటూ చాలామంది బాధపడ్డారు.
ఆమె ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లతే, మా డబ్బులు పోయినట్టేనా? అని తెగ ఫీలైపోయారు. అయితే తాను చనిపోలేదని, కేవలం గర్భాశయ క్యాన్సర్‌పై జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోస్ట్ చేశానని వీడియోతో షాక్ ఇచ్చింది పూనమ్ పాండే.
పూనమ్ పాండే మొదటి నుంచి ఇలాంటి తల తిక్కపనులు ఎన్నో చేసింది. ఇన్‌స్టాలో న్యూడ్ ఫోటోలు షేర్ చేసి, పబ్లిక్ ప్లేసుల్లో న్యూడ్ ఫోటో షూట్‌లు చేసి, పోర్న్ మూవీలో నటించి వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు అవన్నీ చాలనట్టుగా ఇలా ఫేక్ డెత్ న్యూస్‌తో ఉన్న కాసింత పరువు కూడా పోగొట్టుకుంది పూనమ్ పాండే..