PM Modi : ప్రధానమంత్రిగా మూడోవిడత బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో గల ఓ రిసార్టులో జీ7 అధునాతన ఆర్థికవ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈనెల 13 – 15 తేదీల మధ్య జరిగే ఈ సమావేశంలో గాజా ఘర్షణ ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
ఏడు సభ్య దేశాలైన US, UK, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు ఫ్రాన్స్, అలాగే యూరోపియన్ దేశాల నుండి నాయకులు హాజరు కానున్నారు. ఔట్రీచ్ కంట్రీగా G7 సమ్మిట్‌కు ఆహ్వానించబడిన భారతదేశం, దాని ఎజెండాలో రక్షణ మరియు సముద్ర సహకారాన్ని కలిగి ఉందని రాయబారి వాణీ రావు తెలిపారు.
FIFA WC qualifier : చెత్త రిఫరీ.. ఛీట్ చేసి గెలిచిన ఖతార్..
ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రధాని మోదీ గురువారం ఇటలీకి అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో వెళతారని, ఇది మూడోసారి ప్రధానిగా తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన అని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ సమయంలో చర్చించిన కొన్ని కీలక అంశాలపై ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని శ్రీమతి వాణీరావు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో పాటు ఇతర నేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.