Pawan Kalyan – Trivikram : పవన్ కళ్యాణ్‌కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘జల్సా’ మూవీతో ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కి హిట్టు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ అంటూ ఇండస్ట్రీ హిట్టు ఇచ్చాడు. హ్యాట్రిక్ కాంబోగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే తివిక్రమ్ శ్రీనివాస్‌ని వదల్లేదు పవన్ కళ్యాణ్. నిజానికి అత్తారింటికి దారేది మూవీ తర్వాత పవన్ కళ్యాణ్, తివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకి ‘కోబలి’ అనే టైటిల్ కూడా అనుకున్నారు..
పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఫ్యాక్షన్ సినిమా చేయలేదు. ‘బంగారం’ మూవీలో విలన్ ఫ్యాక్షనిస్టులా చూపించినా, అది ఎటూ కానీ సినిమా. దీంతో చిరంజీవికి ‘ఇంద్ర’ మూవీలా, పవన్ కళ్యాణ్ కెరీర్‌కి ‘కోబలి’ ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పెట్టడంతో ‘కోబలి’ సినిమా ఆగిపోయింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Astrologer Venu Swamy : వైసీపీని భయపెడుతున్న వేణు స్వామి.. SRH ఓటమితో జగన్ ఓటమి ఖాయమేనా..
దీంతో ‘కోబలి’ ప్లేస్‌లో ‘అజ్ఞాతవాసి’ తీసి, పవన్ కళ్యాణ్‌కి పెద్ద రాడ్ సినిమా ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా డిజాస్టర్ అయ్యాక ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ చేశాడు త్రివిక్రమ్. ముందుగా పవన్ కళ్యాణ్‌తో అనుకున్న లైన్‌లో కొన్ని మార్పులు చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ చేశాడట త్రివిక్రమ్. ఫ్యాక్షన్ సినిమాలో కూడా హీరో క్యారెక్టరైజేషన్‌కి హ్యూమర్ ఉండేలా ‘కోబలి’ రాసుకున్న గురూజీ, ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్‌తో సీరియస్‌గా సాగే సినిమాని తీయాలని ఫిక్స్ అయ్యాడు.
అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్‌కి, ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీలో హీరో క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాలో సునీల్ వంటి కమెడీయన్లు ఉన్నా కామెడీ కూడా చాలా తక్కువ. ‘అజ్ఞాతవాసి’ తర్వాత వచ్చిన ట్రోల్స్ కారణంగా తన మార్కు కామెడీ లేకుండా ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీని తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..